Stock Market: నిన్న భారీ నష్టాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు పుంజుకున్నాయి. కొనుగోలుదారుల నుంచి అందిన మద్దతుతో మధ్యాహ్నం 1.05 గంటలకు సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1116 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో సూచీ నిఫ్టీ 320 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 914 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 483 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి.
నష్టాల నుంచి తేరుకున్న సమయంలో బీఎస్ఈ సూచీలో ఉన్న మెుత్తం 3,461 స్టాక్స్ లో 2,402 కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ ఆటో సూచీ 2.41 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతోంది. దీనికి తోడు ఐటీ రంగం షేర్లు భారీగా లాభపడ్డాయి.

ఈ రోజు ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ కంపెనీల షేర్లలో భారీ మెుమెంటం కనిపించింది. ఆటో, బ్యాంక్, మెటల్, ఆయిల్ & గ్యాస్, పవర్, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు 1-2 శాతం చొప్పున అధికంగా ట్రేడవుతున్నాయి.
More From GoodReturns

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications