Stock Market: వరుస సెలవుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి తెరచుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ప్రధానంగా ఈ రోజు మార్కెట్లలో ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఫోకస్‌లో ఉన్నాయి.
ఉదయం మార్కెట్ల ప్రారంభంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ సూచీ 59 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 114 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 156 పాయింట్ల లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా కొనసాగుతున్నాయి.

ప్రధానంగా అమెరికాలోని బ్యాంకింగ్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లను కొంత భయాలకు లోనుచేస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ దివాలా తీయటం అక్కడి మార్కెట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. దీంతో అక్కడి మార్కెట్లు ఫ్లాట్ గా తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇదే క్రమంలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రకటనపై ఆందోళనలు నెలకొన్నాయి.
NSE సూచీలో ఐషర్ మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, హిందాల్కొ, ఎల్ టి, నెస్లే, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, బ్రిటానియా, విప్రో, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, సిప్లా, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో హీరో మోటార్స్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications