Closing Bell: క్లోజింగ్ మ్యాజిక్.. నష్టాల్లో ముగిసిన బెంచ్ మార్క్స్..!!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు రోజంతా ఒడిదొడుకులతో కొనసాగిన తర్వాత చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో నేడు రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్ రంగాలకు చెందిన షేర్లు లాభాలతో ముగియగా, ఇదే క్రమంలో ఎఫ్ఎంసీజీ రంగంలోని కంపెనీలు నష్టపోయాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో సెన్సెక్స్ సూచీ 72 పాయింట్ల క్షీణతను నమోదు చేయగా, మరో కీలక సూచీ నిఫ్టీ 32 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 165 పాయింట్లు పెరగగా, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 394 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించాయి. త్వరలోనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేయనున్న తరుణంలో ఇన్వెస్టర్లు సైతం జాగ్రత్తగా ముందుకు సాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బ్రిటానియా, ఎస్బీఐ, నెస్లే, ఎల్ టిఐఎమ్, దివీస్ ల్యాబ్, సిప్లా, బజాజ్ ఆటో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి నేడు టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎయిర్ టెల్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, మారుతీ, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనీలివర్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications