Stock Market: నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. మెరిసిన ప్రభుత్వ బ్యాంకులు..
Stock Market: ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. ప్రధాన సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్ మాత్రం మంచి పనితీరును కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 127 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 88 పాయింట్ల మేర లాభంతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.

ఎన్ఎస్ఈలో మార్కెట్లు ముగిసే సమయంలో ఎస్బీఐ లైఫ్, హీరో మోటార్స్, సిప్లా, టెక్ మహీంద్రా, విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, ఐషర్ మోటార్స్, డాక్టర్ సెడ్డీస్, మారుతీ, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, దివీస్ ల్యాబ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, టాటా స్టీల్, గ్రాసిమ్, ఐటీసీ, యూపీఎల్ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.


Click it and Unblock the Notifications