Stock Market: ఒత్తిళ్లు జయించి లాభావల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. ఐటీ స్టాక్స్ మ్యాజిక్..
Market Closing: ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగించిన బెంచ్ మార్క్ సూచీలు చివరికి లాభాల బాట పట్టాయి. దీంతో మార్కెట్లు చివరికి సానుకూలంగా ముగింపు పలికాయి. ప్రధానంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ దీనికి దన్నుగా నిలిచాయి.
సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 305 పాయింట్ల లాభపడగా.. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 76 పాయింట్ల లాభంలో ఉంది. అలా నిఫ్టీ సూచీ 22,200 మార్కుకు అతి చేరువలో తన ప్రయాణాన్ని నేడు ముగించింది. ఈ క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 12 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం చివరికి లాభాలు ఆవిరై 61 పాయింట్ల నష్టంతో నేడు ట్రేడింగ్ క్లోజ్ చేసింది.

ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, టీసీఎస్, పవర్ గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, సిప్లా, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎయిర్ టెల్, టాటా స్టీల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, గ్రాసిమ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టి, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, హెచ్సీఎల్ టెక్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా సానుకూల ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, బీపీసీఎల్, ఎల్ టిఐఎమ్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు నిలిచాయి.


Click it and Unblock the Notifications