Stock Market: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగంలోని బ్యాంకింగ్ స్టాక్స్ షేర్లపై ఇన్వెస్టర్ల ఫోకస్ కొనసాగుతోంది.
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ సూచీ 85 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 306 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 101 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది.

ప్రధానంగా చాలా కంపెనీలు తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్న తరుణంలో మార్కెట్లు బుల్ రన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మెరుగైన లాభాలను నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు ఆ బ్యాంక్ షేర్లపై దృష్టి సారించారు. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో క్లోజ్ కావటం భారత మార్కెట్లకు కొంత కలిసొస్తోంది.
NSE సూచీలో ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, పవర్ గ్రిడ్, బ్రిటానియా, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, టాటా కన్జూమర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, విప్రో, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, యూపీఎల్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications