Stock Market: మండే మార్కెట్ క్రాష్.. ఇంట్రాడేలో 900 కోల్పోయిన సెన్సెక్స్..
Stock Market: మార్కెట్లు నేడు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. సోమవారం అనూహ్యంగా సూచీలు కుప్పకూలటానికి ప్రధానంగా 5 కారణాలను మార్కెట్ నిపుణులు చూపుతున్నారు.ఈ క్రమంలో క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ సూచీ 361 పాయింట్లు, నిఫ్టీ 111 పాయింట్ల నష్టాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్టార్‌లో అల్లకల్లోలం కారణంగా గ్లోబల్ సెంటిమెంట్ మార్కెట్లను బేర్స్ చేతిలోకి వెళ్లేలా చేశాయి. US రుణదాతలు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం.. యూరప్‌లోని స్విస్ బ్యాంక్ UBS క్రెడిట్ సూయిస్‌ను స్వాధీనం చేసుకోవడం వల్ల ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు ఆందోళన చెందారు. ఇది మార్కెట్లలో భారీ అమ్మకాలను ప్రేరేపించింది.

అమెరికా వాల్ స్ట్రీట్ లో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనపరిచింది. ఈ క్రమంలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నిక్కీ 225, హ్యాంగ్ సెంగ్, S&P 200, కోస్పి అండ్ షాంఘై కాంపోజిట్ సూచీలు 3 శాతం వరకు క్షీణించాయి. దీనికి తోడు మార్చి 22న రెండు రోజుల ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం కావటంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సారి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందా లేక పెంపులు కొంత కాలం నిలిపివేస్తారా అనే అంశం చర్చనీయాశంగా మారింది.
సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లసై భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ షేర్లు 5.6 శాతం వరకు క్షీణించాయి. దీనికి తోడు రూ.34,900 కోట్ల విలువైన గ్రూప్ గుజరాత్ ముంద్రా పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ పనులు తాత్కాలికంగా నిలిపివేయటంతో ఆందోళనలు పెరిగాయి.
మార్కెట్లు ప్రారంభం నుంచే దూకుడుగా నష్టాల్లోకి జారుకోవటంతో సూచీల్లో రక్తపాతం కొనసాగించి. ఈ క్రమంలో ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్ఠంగా 900 పాయింట్ల వరకు నష్టపోయింది. అయితే చివర్లో లభించిన కొనుగోళ్ల మద్ధతుతో తిరిగి సూచీలు కోలుకున్నాయి. బజాజ్ ట్విన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.


Click it and Unblock the Notifications