Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు అనుకున్నట్లుగానే ఈ వారం లాభాలతో ట్రేడింగ్ మెుదలు పెట్టాయి. ఉదయం 9.15 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 132 పాయింట్ల లాభంతో ఉండగా, నిఫ్టీ సూచీ 40 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 65 పాయింట్ల లాభంలో ఉన్నాయి. అయితే మార్కెట్లలో ఉన్న అధిక ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు సూచీల్లో భారీగా ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నాయి.

చైనా నిజాలు..
లాభాల్లో మెుదలైనప్పటికీ కొన్ని నిమిషాల్లోనే అవి ఆవిరయ్యాయి. అలా సూచీలు అటు లాభాల్లోకి, ఇటు నష్టాల్లోకి జారుకుంటూ ఊగిసలాడుతున్నాయి. దీనికి ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి కారణంగా తెలుస్తోంది. అయితే ఈ రోజు మార్కెట్లు ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కరోనా కేసుల విజృంభణపై చైనా నిజాలు దాస్తోందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్..
ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దివీస్ ల్యాబ్స్, యూపీఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలుస్తున్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమయంలో హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, ఎస్బీఐ లైఫ్ షేర్లు మాత్రం నష్టపోయి ఎన్ఎస్ఈ సూచీలో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications