ప్రముఖ ఇన్వెస్టర్, భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. మార్కెట్ వర్గాలు ఆయనను "ఇండియాస్ వారెన్ బఫెట్" అని పిలుస్తారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జున్‌జున్‌వాలా 62 ఏళ్ల వయస్సులో మరణించారు.

అనేక కంపెనీలకు నేతృత్వం వహిస్తూ..
జున్‌జున్‌వాలా వ్యాపారి, చార్టర్డ్ అకౌంటెంట్, దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరుగా ఉన్నారు. జున్‌జున్‌వాలా హంగామా మీడియా , ఆప్‌టెక్‌లకు ఛైర్మన్‌గా ఉన్నారు. అలాగే వైస్రాయ్ హోటల్స్, కాంకర్డ్ బయోటెక్, ప్రోవోగ్ ఇండియా, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.

రూ.5000తో ప్రారంభం..
జున్‌జున్‌వాలా కాలేజీలో ఉన్నప్పుడు, అతను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. అతను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను దలాల్ స్ట్రీట్‌లో తన కెరియర్ నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. జున్‌జున్‌వాలా 1985లో కేవలం రూ.5,000 పెట్టుబడితో తన స్టాక్ మార్కెట్ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ మూలధనం సెప్టెంబర్ 2018 నాటికి రూ.11,000 కోట్లకు పెరిగింది.

తండ్రి తరువాత..
రాకేష్ జున్‌జున్‌వాలా తండ్రి తన స్నేహితులతో స్టాక్ మార్కెట్ గురించి చర్చించడం విన్న తర్వాత, జున్‌జున్‌వాలా దానిపై ఆసక్తి పెంచుకున్నాడు. జున్‌జున్‌వాలా తన తండ్రిని ఫాలో అవుతూ.. తాను రోజూ వార్తాపత్రికలను చదవేవాడు. ఎందుకంటే.. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమైన వార్తల గురించి విశ్లేషించేవాడు. అతని తండ్రి అతన్ని స్టాక్ మార్కెట్‌లో కెరీర్ ప్రారంభించటానికి అనుమతించినప్పటికీ.. అందుకు అవసరమైన ఆర్థిక సహాయం, నిధులను ఇచ్చేందుకు నిరాకరించారు. పైగా స్నేహితుల నుంచి అప్పుడు తీసుకోకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications