Stock Market: లాభాల్లో కీలక సూచీలు.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఫ్లాట్ స్టార్ట్..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు మహావీర్ జయంతి సందర్భంగా నిన్న మార్కెట్ల సెలవు తర్వాత ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ స్పందన కారణంగా దేశీయ సూచీలు ప్రతిస్పందిస్తున్నాయి.
ఉదయం 9.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 241 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 90 పాయింట్ల లాభంలో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 65 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది.

అమెరికాకు చెందిన బేబీ పౌడర్ తయారీదారు జాన్సన్ అండ్ జాన్సన్ దివాలా కోసం రెండవసారి దాఖలు చేసింది. జాన్సన్ & జాన్సన్ తన ఐకానిక్ బేబీ పౌడర్ మరియు ఇతర ఉత్పత్తులలో టాల్క్ క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆరోపిస్తూ పదివేల వ్యాజ్యాలను పరిష్కరించేందుకు 8.9 బిలియన్ డాలర్ల చెల్లించడానికి అంగీకరించినట్లు కంపెనీ తెలిపింది.
NSE సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్టైన్మెంట్, ఎల్ టి, ఐటీసీ, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, యూపీఎల్, దివీస్ ల్యాబ్స్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, సిప్లా, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలో ఐషర్ మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కొ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టాటా స్టీల్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications