Silicon Valley Bank: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు, వెంచర్ క్యాపీటలిస్ట్స్ తో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ బ్యాంక్ లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కోవటంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇదే సమస్య అనేక యూఎస్ బ్యాంకులను ఇప్పుడు వెంటాడుతోంది. అయితే ఈ సంక్షోభాన్ని నివారించి.. బ్యాంకులను కాపాడేందుకు పెద్ద బ్యాంకులు 30 బిలియన్ డాలర్ల ఫండ్ ను ఏర్పాటు చేశాయి.
అమెరికాలో దెబ్బ తిన్న బ్యాంక్ పై కేంద్రం ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూనే ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకులో భారత స్టార్టప్ కంపెనీల నిధులు ఇరుక్కున్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రాకేష్ జున్‌జున్ వాలాకు చెందిన నజారా టెక్నాలజీస్ ఇటీవల తన రెండు సబ్సిడరీ కంపెనీలకు చెందిన నిధులు ఎస్వీబీలో ఉన్నాయని వెల్లడించింది. అయితే ఇలా ఎన్ని సంస్థల డబ్బు సిలికాన్ వ్యాలీ బ్యాంకులో డిపాజిట్లుగా ఉన్నయానే దానిపై కేంద్రం ఆరా తీసింది.

భారతీయ స్టార్టప్‌లకు చెందిన 1 బిలియన్ డాలర్ల డిపాజిట్లు అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం వెల్లడించారు. స్టార్టప్‌లకు కీలకమైన నిధుల వనరుగా ఉన్న సిలికాన్ వ్యాలీ కుప్పకూలటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతటా షాక్‌వేవ్‌లను పంపింది. స్టార్టప్‌ల డిపాజిట్లలో 200 మిలియన్ డాలర్లకుపైగా GIFT సిటీ బ్యాంక్‌కు బదిలీ చేయబడిందని తాను విన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యం గురించి బుధవారం ఆర్థిక మంత్రితో చర్చించానని, స్టార్టప్‌ల అవసరాలకు అనుగుణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థను చక్కదిద్దాలని నిర్ణయించినట్లు చంద్రశేఖర్ చెప్పారు. భారత సెమీకండక్టర్ల ప్రయాణం 2023లో ప్రారంభం కానుందన్న ఆయన.. చిప్ మేకింగ్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. 50-55 కంటే ఎక్కువ డిజైన్ స్టార్టప్‌లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications