Paytm Share: 5% లాభంలో పేటీఎం షేర్లు.. ప్రధాని మోదీకి స్పెషల్ రిక్వెస్ట్.. పూర్తి వివరాలు
Paytm Stock Gains: దేశంలోని చెల్లింపుల ఫిన్‌టెక్ దిగ్గజంగా ఉన్న పేటీఎం కొద్ది రోజులుగా రెగ్యులేటరీ ఇబ్బందుల్లో కూరుకుపోయింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారాన్ని నిలిపివేయాలని రిజర్వు బ్యాంక్ చెప్పటంతో స్టాక్ కుప్పకూలి దాదాపు 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువను కోల్పోయింది.
అయితే ఈరోజు పేటీఎం కంపెనీ షేర్లలో జోష్ తిరిగి కనిపించింది. దాదాపు 43 శాతం మేర స్టాక్ ధర ఆవిరైన తర్వాత నేడు లాభపడటం పెట్టుబడిదారులకు పెద్ద ఊరటను కలిగిస్తోంది. ఉదయం 10 గంటల సమయంలో స్టాక్ 4.57 శాతం లాభంతో రూ.458.65 వద్ద తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తోంది. భారతీయ స్టార్టప్ కంపెనీలపై రిజర్వు బ్యాంక్ కఠిన నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు కొంత ఆందోళనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ఆందోళనలు తగ్గించేందుకు వీలుగా దేశంలోని 12 మంది స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రిజర్వు బ్యాంక్ లకు సంయుక్తంగా లేఖ రాశారు. అందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారంపై భారీగా ప్రభావాన్ని చూపించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్ పర్యావరణ వ్యవస్థతో నిర్మాణాత్మక సంభాషణలో పాల్గొనాలని వారు కోరారు.
ప్రధానికి లేఖ రాసిన వ్యాపారవేత్తల్లో భారత్ మ్యాట్రిమోనీకి చెందిన మురుగవేల్ జానకిరామన్, క్యాపిటల్ మైండ్‌కి చెందిన దీపక్ షెనాయ్, ఇన్నోవ్8కి చెందిన రితేష్ మాలిక్, GOQiiకి చెందిన విశాల్ గొండాల్, PB ఫిన్‌టెక్‌కి చెందిన యాషిష్ దహియా, మేక్‌మైట్రిప్‌కు చెందిన రాజేష్ మాగో వంటి పేర్లు ఉన్నట్లు సమాచారం.
రిజర్వు బ్యాంక్ ఇటీవలి ఆదేశాలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు పొందుతున్న మిలియన్ల మంది వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతాయని స్టార్టప్ వ్యవస్థాపకులు ఆందోళన వ్యక్తం చేశారు. కస్టమర్లతో పాటు వ్యాపారుల ఉత్తమ ప్రయోజనాలను కాపాడాలను వారు కోరారు. అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు వ్యాపార అనుకూల దేశంగా ఉన్న భారత ప్రతిష్టను ప్రభావితం చేయగలవని వారు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications