Layoff News: దేశంలోని టెక్ ఉద్యోగులు లాక్‌డౌన్ సమయంలో భారీగా 3-4 రెట్లు వేతన పెంపులను అందుకున్నారు. ఎక్కువగా ఉద్యోగ అవకాశాలతో పాటు మూన్ లైటింగ్, ఫ్రీలాన్సింగ్ వంటి ఇతర మార్గాల్లో భారీగా ఆర్జించారు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది.
ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఫండింగ్ నిలిచిపోవటంతో స్టార్టప్ లతో పాటు టెక్ కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. 2022 నుంచి ఇప్పటి వరకు.. దేశంలోని 95 స్టార్టప్‌లు దాదాపు 31,965 మంది ఉద్యోగులను తొలగించాయని మార్కెట్ డేటా వెల్లడించింది. ఇటీవల దేశీయ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ సైతం సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా 3000-4000 మంది ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నట్లు వెల్లడైంది.

లేఆఫ్స్ ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలని, లాభాల బాట పట్టాలని అనేక స్టార్టప్ కంపెనీలు చూస్తున్నాయి. అలాగే ఫండింగ్ కొరత సమయంలో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని తమ వ్యాపారాలను దివాలా తీయకుండా తప్పించుకోవాలని, వాటిని దివాలా నుంచి కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పటం అతిశయోక్తి అస్సలు కాదు. గత కొన్ని నెలలుగా భారతీయ స్టార్టప్ మార్కెట్లో తొలగింపుల సంఖ్య తగ్గినప్పటికీ.. కొత్త ఉద్యోగాల ఆశలు కనిపించటం లేదు. 2023లో సైతం తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
2023లో 49 స్టార్టప్‌లు దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించాయి. అనేక స్టార్టప్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను చాలా నిశ్శబ్దంగా ఉంచుతున్నందున తొలగింపుల వాస్తవ లెక్కలు బయటకు రావటం లేదు. ఈ క్రమంలో 2022-23లో అత్యధిక తొలగింపులను ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో ByJuice అగ్రస్థానంలో ఉంది. మరింత కాలం ఈ తొలగింపులు కొనసాగుతాయా లేక కొత్త ఉద్యోగాల ఆశలు చిగురిస్తాయా అనే విషయం రానున్న కాలంలో వచ్చే పెట్టుబడుల ప్రవాహంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications