Masala Row: మసాలాల్లో రసాయనాల వివాదంపై స్పైసెస్ బోర్డ్ చర్యలు.. కొత్త మార్గదర్శకాలు

Spices Board: ప్రపంచంలో స్వాతంత్య్రానికి ముందు నుంచే ఇండియా సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. అయితే తాజాగా దేశీయ స్పైస్ ఉత్పత్తి కంపెనీలపై వచ్చిన వరుస ఆరోపణలతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలో స్పందించిన సంగతి తెలిసిందే. తాము అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే అనుమతులు అందిస్తున్నట్లు ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇచ్చింది.

ఇటీవల కొన్ని దేశాల్లో భారత్ నుంచి ఎగుమతి చేయబడిన మసాలా ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక రసాయనం ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు వచ్చిన ఆరోపణలతో స్పైస్ బోర్డ్ అప్రమత్తమైంది. రసాయనపూరితమైన ఉత్పత్తుల ఎగుమతిని నివారించేందుకు ఎగుమతిదారులకు సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాల్లో ఇథిలీన్ ఆక్సైడ్ వాడకాన్ని నివారించడం, కాలుష్యం కోసం పరీక్షించడం, సరఫరా గొలుసు అంతటా నివారణ చర్యలను అమలు చేయడం వంటివి ఉన్నాయి. దీనితో పాటు రవాణా, నిల్వ / గిడ్డంగి, ప్యాకేజింగ్ మెటీరియల్‌లో సరఫరాదారులు ఈ రసాయనాన్ని ఏ స్థాయిలోనూ ఉపయోగించకుండా చూసుకోవాలి. సరఫరా గొలుసులోని సుగంధ ద్రవ్యాలు, మసాలా ఉత్పత్తులలో ETO, దాని మెటాబోలైట్ లేకపోవడాన్ని నిర్ధారించడానికి ఎగుమతిదారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Indian spices board issue new guidelines to exporters amid Masala Row

ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ స్టెరిలైజేషన్ పద్ధతులను ఉపయోగించమని ప్రోత్సహించారు. ఇథిలీన్ ఆక్సైడ్ గుర్తింపు కారణంగా హాంకాంగ్ మరియు సింగపూర్ ప్రసిద్ధ మసాలా బ్రాండ్‌లను నిషేధించిన తర్వాత ఈ మార్గదర్శకాలు వచ్చాయి. హాంకాంగ్, సింగపూర్‌లోని ఆహార భద్రత సంస్థలు ప్రముఖ మసాలా బ్రాండ్లు MDH, ఎవరెస్ట్ విక్రయాలను నిషేధించిన తర్వాత ఈ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. కార్సినోజెనిక్ కెమికల్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉత్పత్తుల్లో గుర్తించటంతో ఉత్పత్తులను స్టోర్ల నుంచి రీకాల్ చేశారు.

MDH బ్రాండ్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మాసాలా మిక్స్‌డ్ మసాలా పౌడర్.. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయవద్దని హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వినియోగదారులకు ఇప్పటికే సూచించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశపు మసాలా ఎగుమతులు మొత్తం 4.25 బిలియన్ల డాలర్లుగా ఉన్నాయి. ఇది ప్రపంచ మసాలా ఎగుమతుల్లో 12 శాతంగా ఉంది.

మసాలా దినుసులపై లేవనెత్తిన ప్రశ్నల మధ్య ఆర్థిక పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) ఒక నివేదికలో ఈ సమస్యపై తక్షణమే దృష్టి పెట్టాలని పేర్కొంది. ముఖ్యమైన మార్కెట్లలో 700 మిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు వాటాలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. అనేక దేశాల్లో నియంత్రణ చర్యలు మసాలా ఎగుమతుల్లో సగానికి పైగా నష్టానికి దారితీయవచ్చని హెచ్చరించింది. భారతదేశం నాణ్యత సమస్యలను త్వరగా, పారదర్శకతతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+