Space Economy: భారత అంతరీక్ష ప్రయోగాల ప్రయాణం ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. దీంతో అనేక దేశాలు సైతం తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేసేందుకు ఇస్రోతో చేతులు కలుపుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దీనివల్ల శాస్త్రవేత్తలకు మెరుగైన పని వాతావరణం కూడా లభిస్తుందని అన్నారు. 2040 నాటికి దీని విలువ 100 బిలియన్లకు చేరుకోవచ్చని 'AKD' వంటి కొన్ని విదేశీ ఏజెన్సీలు అంచనా వేసినట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ అండ్ అంతరిక్ష శాఖ సహాయ మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఇది దాదాపు 80 లక్షల అమెరికన్ డాలర్ల విలువను మాత్రమే కలిగి ఉందని సింగ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే కేవలం విదేశీ ఉపగ్రహ ప్రయోగాల్లోనే మనం చాలా వేగంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. యూరోపియన్ ఉపగ్రహాల ప్రయోగాల ద్వారా దాదాపు 23-24 కోట్ల యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగాల ద్వారా 17-18 కోట్ల అమెరికన్ డాలర్లు ఆర్జించినట్లు పేర్కొన్నారు. నేడు ఇస్రో తన 60వ రాకెట్ ప్రయోగ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించింది. ఈ క్రమంలో 'అనుశాంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్' స్థాపనతో పరిశ్రమలో గణనీయమైన ఉనికిని నెలకొల్పవచ్చని అన్నారు.
భారత్ తన అంతరిక్ష రంగంలో వనరుల పరిమితులను ఎదుర్కొంటుంది అనే వాస్తవాన్ని అంగీకరిస్తూ.. "మనకు ఉన్న శాస్త్రీయ నైపుణ్యాలతో మేము దానిని ఎదుర్కోగలము" అని కేంద్ర మంత్రి చెప్పారు. 2025 నాటికి భారతదేశం ఒక వ్యక్తిని పంపుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రయోగానికి ముందు అంతరీక్షంలోకి ఒక మహిళా రోబోను పంపనున్నట్లు వెల్లడించారు. ఇది వ్యోమగాములు చేసే అన్ని కార్యకలాపాలను అనుకరిస్తుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications