Investments: గత ఏడాది కాలంగా దేశంలోని ఇన్వెస్టర్లు తమ డబ్బును స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్లలో పార్క్ చేస్తున్నారు. దీనికి తోడు రెండేళ్లుగా మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోలలో అధిక శాతం మిడ్-స్మాల్ కేటగిరీవి కావటం పెట్టుబడిదారులను ఆకట్టుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రంగా ఉన్న తరుణంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇంట్రాడేలో సెకండ్ సెషన్లో మార్కెట్లు రికవరీని నమోదు చేశాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమయానికి రికవర్ అయ్యాయి. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నప్పటికీ భారీ నష్టాల నుంచి రికవర్ అయ్యాయి.

వాస్తవానికి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగటంతో నేడు సూచీలు కుప్పకూలాయి. అధిక వ్యాల్యుయేషన్ల కారణంగా ఈ కేటగిరీలోని కంపెనీల షేర్లలో ముందస్తుగా లాభాల స్వీకరణకు రిటైల్ ఇన్వెస్టర్లు వెళ్లినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విస్తరించిన వాల్యుయేషన్‌పై ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు పాక్షిక లాభాలను బుక్ చేసుకోవడానికి ముందుకు రావడంతో విస్తృత మార్కెట్ దెబ్బతింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 1.4 శాతం క్షీణించగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం దిగువన ట్రేడవుతోంది.
మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 1 శాతానికిపైగా క్షీణించి 498 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీ 2.17 శాతం క్షీణతతో 345 పాయింట్లను కోల్పోయింది. ఈ కేటగిరీలోని కంపెనీల విలువలు ప్రమాదకర గరిష్ఠాలకు చేరుకోవటం వల్లే నేడు కరెక్షన్ జరుగుతోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications