భారతీయుల అభిరుచులు మారుతున్నాయి. తమకు నచ్చిన వస్తువులు ఎక్కడ ఉన్నా వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. డబ్బుల విషయంలో వెనుకాడే ప్రసక్తే ఉండదు. ఈ- కామర్స్ వెబ్ సైట్లు వచ్చిన తర్వాత పల్లెల్లో ఉన్న వారు కూడా తమకు అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిన ఫలితంగా షాపింగ్ మరింత ఈజీగా మారిపోయింది. అసలు విషయం ఏమిటంటే మనదేశంలోని ప్రతి ఇద్దరు మొబైల్ షాపర్స్ లో ఒకరు విదేశీ వెబ్ సైట్లలో కొనుగోళ్లు చేస్తున్నారు. దేశంలో ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో సగం మంది విదేశీ వెబ్ సైట్ల ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని డిజిటల్ పెమెంట్స్ సంస్థ పేపాల్ తాజా నివేదిక వెల్లడించింది.
మొబైల్ కామర్స్ లో మనదే హవా
* ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మొబైల్ కామర్స్ లో భారత్ హవా సాగుతోంది. మన దేశంలోని 88 శాతం మంది ఆన్ లైన్ చెల్లింపుల కోసం మొబైల్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. 81 శాతం మంది భారత వ్యాపారాలు మొబైల్ షాపింగ్ కు అనుగుణంగా మారిపోయారు.
* ఈ అధ్యయనాన్ని ప్రపంచవ్యాప్తంగా 11 మార్కెట్లో నిర్వహించారు. ఇందులో 22,000 మంది కస్టమర్లు, 4,602 వ్యాపార సంస్థలు పాల్గొన్నాయి.
* అధ్యయనంలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది క్రాస్ బోర్డర్ షాపింగ్ చేస్తున్నట్టు తెలిపారు.

అవరోధాలున్నాయి..
* గత ఆరు నెలల్లో భారత వ్యాపార సంస్థలు తమ అమ్మకాల్లో అంతర్జాతీయ కస్టమర్ల నుంచి 47 శాతం పొందాయి. ఉత్పత్తుల్లో నాణ్యత, ఆసక్తి కరమైన ఉత్పల్లుడు ఉండటం వంటివి ఇందుకు దోహదపడినాయి. అయితే సరుకుల రవాణా వ్యయాలు, డెలివరీకి తీసుకునే సమయం, సుంకాలపై స్పష్టత లేకపోవడం, రిటర్న్ షిప్పింగ్ వ్యయాలు వంటివి అంతర్జాతీయ షాపింగ్ కు అవరోధాలుగా మారుతున్నాయి.
అన్నింటికీ మొబైల్ ఫోన్...
* మొబైల్ షాపింగ్ చేసే వారిలో అధిక శాతం మంది స్మార్ట్ ఫోన్లనే వినియోగిస్తున్నారు. మిల్లీనియల్స్ మొబైల్ షాపర్స్ లో 47 శాతం మంది తమ మొబైల్స్ ద్వారా యాదృచ్చికంగా కొనుగోళ్లు చేస్తున్నారు.
* దేశంలోని వ్యాపారస్థులో 39 శాతం మంది మొబైల్ యాప్ లను కలిగి ఉన్నారు. ప్రపంచ సగటు 24 శాతంగా ఉంది. ఆన్ లైన్ అమ్మకాల్లో 51 శాతం మొబైల్ యాప్ ల ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచ సగటు 41 శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications