For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rupee Trade: శక్తివంతమైన రూపాయి అస్త్రం.. భళా శక్తికాంత దాస్.. చర్చలతో డాలర్ గుండెల్లో చిచ్చు

|

Rupee Trade: అమెరికా డాలర్ పై ఆధారపడి ప్రపంచ దేశాలు వాణిజ్యం చేయటంతో చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. మాంద్యం కారణంగా ఫెడ్ రేట్లు పెంచటంతో లిక్విడిటీ తగ్గటం, డాలర్లకు డిమాండ్ పెరగటంతో చాలా దేశాల సొంత కరెన్సీలు పతనం అయ్యాయి. ఇందులో రూపాయి కూడా కొంత విలువను కోల్పోయింది. దీనికి ప్రత్యామ్నాయం ఏర్పాటుకు భారతీయ రిజర్వు బ్యాంక్ చర్యలు చేపట్టింది.

రూపాయితో వ్యాపారం..

రూపాయితో వ్యాపారం..

దక్షిణాసియా దేశాలతో రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను నిర్వహించాలని భారతీయ రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నాయి. ఇందుకోసం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాతో భారత్ రూపాయి చెల్లింపుల మార్గంలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. దీని తర్వాత దాదాపు 35 దేశాలు ఇదే మార్గంలో వాణిజ్య చెల్లింపులకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

 దేశాలకు ప్రయోజనం..

దేశాలకు ప్రయోజనం..

2023 కూడా అనిశ్చితిని కొనసాగిస్తుందని చాలా మంది ఆర్థిక నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ క్రమంలో దక్షిణాసియా దేశాలు అంతర్-ప్రాంతీయ వాణిజ్యం నుంచి ప్రయోజనం పొందొచ్చని దాస్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రూపాయి చెల్లింపు విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. రూపాయి చెల్లింపు వ్యవస్థ, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ దేశాలకు ప్రయోజనం కలిగిస్తుందని దాస్ అభిప్రాయపడ్డారు.

డిజిటల్ కరెన్సీ..

డిజిటల్ కరెన్సీ..

ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(CBDC) ట్రయల్ దశలో ఉందని శక్తికాంత దాస్ వెళ్లడించారు. డిజిటల్ రూపాయి లాంచ్ పై RBI చాలా జాగ్రత్తగా ముందుకెళుతోందని ఆయన అన్నారు. ప్రపంచం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవటానికి విస్వసనీయమైన మానిటరీ పాలసీ చర్యలు, సరఫరా వ్యవస్తలో జోక్యాలు, ఆర్థిక వాణిజ్య విధానాలు వంటివి చాలా కీలకమైవని అన్నారు.

 ద్రవ్యోల్బణం తగ్గింపు..

ద్రవ్యోల్బణం తగ్గింపు..

ప్రపంచ వ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు తగ్గటం.. కమోడిటీల ధరలు తగ్గటానికి దోహదపడుతున్నాయి. ఇది భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కానీ ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నందున వృద్ధి నష్టాలు తగ్గుతాయని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. దక్షిణాసియాలో ధరల స్థిరత్వానికి దేశాలు ప్రాధాన్యతను ఇవ్వటం ఉత్తమమైన ఆప్షన్ అని అన్నారు. దీనిని సాధింటానికి డాలర్ స్థానంలో రూపాయిని చెల్లింపు మార్గంగా మార్చాలని దాస్ ప్రయత్నిస్తున్నారు.

English summary

Rupee Trade: శక్తివంతమైన రూపాయి అస్త్రం.. భళా శక్తికాంత దాస్.. చర్చలతో డాలర్ గుండెల్లో చిచ్చు | Indian rupee going global with south asian countries for cross border payment settlment

Indian rupee going global with south asian countries for cross border payment settlment
Story first published: Friday, January 6, 2023, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X