ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అన్‌స్టేబుల్ గా ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల (Tariffs) వల్ల ఏర్పడిన అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ తగ్గింది. డాలర్‌పై ఉన్న ఈ ప్రతికూల వాతావరణం ఇతర కరెన్సీలకు లాభం చేకూర్చినా, మన indian rupee (భారత రూపాయి) కి మాత్రం నష్టా్న్నే మిగిల్చింది. indian rupee (భారత రూపాయి) విలువ, కీలక ఆసియా కరెన్సీలతో పోలిస్తే, అత్యధికంగా పతనమై ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ బలహీనతకు ప్రధాన కారణాలు ఏమిటి? దీని ప్రభావం మనపై ఎలా పడుతుందో ఇప్పుడు చూద్దాం.
బలహీనతకు ప్రధాన కారణం..
మన ఇండియన్ రూపీ పై ఒత్తిడి పెరగడానికి ముఖ్య కారణం క్యాపిటల్ ఫ్లోస్ తగ్గడం అలాగే టారిఫ్ లు పెరగడం. గత సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (FY25), విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPI) సుమారు 80,000 కోట్లు ఇండియాలోకి వచ్చాయి. కానీ, ప్రస్తుత FY26 మొదటి ఏడు నెలల్లో ఆ పెట్టుబడులు దాదాపు సున్నాకు పడిపోయాయి. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) మాత్రం పెరిగాయి. FYTD26లో (ఆగస్టు వరకు) నికర FDI ప్రవాహం 10.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తం మీద.. FDI, FPI, అప్పులు అన్నీ కలిపి చూస్తే.. Q2-Q3 FY26లో మొత్తం మూలధన ప్రవాహాలు ప్రతికూలంగా మారాయి. ఈ కారణంగానే ఇండియన్ రూపీ భారీగా పతనమైంది.
కరెంట్ ఖాతా లోటు
అయితే కరెంట్ ఖాతా లోటు (CAD) ప్రభావం రూపాయిపై కాస్త తక్కువగానే ఉంది. ముఖ్యంగా బంగారం దిగుమతి పెరగడం వలన వాణిజ్య లోటు ($155 బిలియన్లు) పెరిగినా సర్వీసుల ఎగుమతి (Services Surplus) , ఎన్నారైల నుంచి వచ్చే నిధులు (Remittances) బలంగా ఉండటం వలన, మొత్తం CAD అదుపులోనే ఉంది. ట్రేడ్ డెఫిసిట్ FY26లో $327 బిలియన్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ, GDPలో CAD అంచనా కేవలం 1.3% మాత్రమే. కాబట్టి ఇండియన్ రూపీ బలహీనతకు ప్రధాన కారణం మూలధన ప్రవాహాల లోటు తప్ప, కరెంట్ ఖాతా లోటు కాదు అని అర్థమవుతోంది.

RBI కొత్త వ్యూహం
ఇండియన్ రూపీ విలువను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యొక్క విదేశీ మారక ద్రవ్య (FX) మార్కెట్ జోక్యం. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ సంవత్సరం RBI జోక్యం తక్కువగా ఉంది. FY26 (అక్టోబర్ వరకు) RBI కేవలం $34 బిలియన్ల నికర డాలర్లను మాత్రమే విక్రయించింది. అయితే సెప్టెంబర్ 2025 నుంచి ఇండియన్ రూపీ పై ఒత్తిడి మళ్లీ పెరగడంతో, RBI మరింత చురుకుగా జోక్యం చేసుకుంటోంది. అక్టోబర్ 2025 లోనే ఏకంగా $17 బిలియన్ల నికర డాలర్లను విక్రయించింది. ఈ పెరిగిన జోక్యం వల్ల USDINRలో అస్థిరత తగ్గింది. కానీ, ఈ జోక్యం వల్ల మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గే అవకాశం ఉంది.
మనపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఇండియన్ రూపాయి పతనం వల్ల సామాన్య ప్రజలపై పడే ప్రధాన ప్రభావాలు ఇవే..
1. దిగుమతులు ఖరీదు: పెట్రోల్, డీజిల్ వంటి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరుగుతాయి.
2. విదేశీ ప్రయాణం: విదేశీ విద్య, పర్యటనలు ఖరీదైనవిగా మారుతాయి.
3. ఎగుమతిదారులకు లాభం: విదేశాలకు వస్తువులు, సర్వీసులు ఎగుమతి చేసే కంపెనీలకు ఆదాయం పెరుగుతుంది.
ఏదేమైనా ప్రస్తుతం మన రూపాయి విలువ బలహీనపడటానికి ప్రధానంగా పెట్టుబడుల కొరత కారణం అయినప్పటికీ రాబోయే కాలంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి త్వరలోనే రూపాయి విలువ మళ్లీ స్థిరపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications