IT Shares: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రధానంగా ఐటీ రంగంలోని కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. ప్రధానంగా నేడు మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవటంలో ఈ స్టాక్స్ కీలకంగా నిలిచాయి.
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ CLSA ఐటీ రంగంలోని కంపెనీ షేర్ల రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసింది. ఈ క్రమంలో టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్ల రేటింగ్ తగ్గించటంతో పతనమయ్యాయి. ఈ క్రమంలో విప్రో, ఎల్‌టిఐఎమ్ కంపెనీ షేర్లకు మాత్రం సెల్ రేటింగ్ ఇచ్చింది. ఇంట్రాడేలో ఐటీ స్టాక్స్ పతనం మార్కెట్లను నష్టాల్లోకి నెట్టింది. సెక్టార్‌పై 2024 వృద్ధి దృక్పథం "ఉత్తమంగా బలహీనంగా" ఉన్నప్పటికీ స్టాక్‌ల వాల్యుయేషన్‌లలో ప్రతిబింబించడం లేదని CLSA విశ్లేషకులు తెలిపారు.

ఈరోజు మార్కెట్ల ఓపెనింగ్ సమయంలో TCS రూ.4,033.10 (-1.1 శాతం), HCL రూ.1,608.55 (-1.79 శాతం), విప్రో రూ.518.65 (-0.35 శాతం)గా ఉన్నాయి. అలాగే మార్కెట్లు క్లోజింగ్ సమయంలో టీసీఎస్ షేర్ ధర 1.71 శాతం తగ్గి రూ.4,010.90 వద్ద, హెచ్సీఎల్ షేర్ ధర 1.25 శాతం తగ్గి రూ.1,617.40 వద్ద, విప్రో షేర్ ధర 1.45 శాతం తగ్గి రూ.512.95 వద్ద, ఇన్ఫోసిస్ స్టాక్ ధర 2.03 శాతం తగ్గి రూ.1,604 వద్ద, ఎల్‌టిఐఎమ్ స్టాక్ ధర 1.57 శాతం తగ్గి రూ.5,135 వద్ద నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఐటి సేవల రంగం డిమాండ్ ఔట్‌లుక్‌కి టాప్-డౌన్ విధానం 2019ని గుర్తుకు తెస్తుంది. గ్లోబల్ కంపెనీల నుంచి టెక్ కంపెనీలకు ఆర్డర్లు 2024లో విశ్వాసం కలిగించలేదని పేర్కొంది. 2024లో బ్యాంకింగ్, రిటైల్, టెలికాం ఔట్‌లుక్ 2023లో ఉన్న దానితో సమానంగా ఉంది. CLSA విశ్లేషకులు HCL, Infosys వృద్ధి మార్గదర్శకత్వం TCS, HCL, Wiproలకు ప్రతికూల ఉత్ప్రేరకంగా ఉంటుందని బ్రోకరేజ్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఐటీ స్టాక్స్ భారీ ర్యాలీకి ఇక బ్రేక్ పడింది. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న వాటాలను విక్రయిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications