భారత రియల్ ఎస్టేట్ రంగం విదేశీయులకు కూడా ఆకర్షణీయంగా మారుతోంది. ధరలు అంతకంతకూ పెరుగుతున్నా.... ప్రతి ఒక్కరూ ఎంతో కొంతో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి ఒక ఐదారేళ్లలో తప్పనిసరిగా రెట్టింపు అవుతోంది. ఇన్వెస్ట్మెంట్ సాధనం కూడా ఈ స్థాయిలో రిటర్న్స్ ఇవ్వకపోవటం వల్ల ఇన్వెస్టర్లలో భరోసా పెరిగిపోతోంది. పైగా... రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల కోసం పెద్దగా పరిశోధన అవసరం లేదు. కేవలం కామన్ సెన్స్ ఉపయోగించి స్థలం, ఇల్లు, అపార్ట్మెంట్ కొనుగోలు చేయవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతుంటారు.
అయితే, కొన్నేళ్లుగా భారత రియల్ ఎస్టేట్ రంగం మన వారినే కాకుండా విదేశి ఇన్వెస్టర్లను కూడా బాగా ఆకర్షిస్తోంది. ఇక్కడ పెట్టుబడులపై భారీ స్థాయిలో రిటర్న్స్ వస్తుండటమే అందుకు కారణం. అందుకే బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు మన దేశంలో కుమ్మరిస్తున్నారు. అదే స్థాయిలో రాబడులు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సవ్వళ్ళు ఉన్నా.... భారత్ లోనూ ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి. 2019 సంవత్సరంలో ఇండియాలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులపై ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనారోక్ ఒక నివేదికను వెల్లడించింది. దాని ఆధారంగా మీకోసం కొన్ని వివరాలు.

500 కోట్ల డాలర్లు..
అనేక సవాళ్ల మధ్య కూడా 2019 లో భారత రియల్ ఎస్టేట్ రంగం మెరుగ్గానే పనిచేసిందని చెప్పాలి. గతేదిలో మన దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ 35,000 కోట్లు) ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇందులో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులే సింహభాగం ఉండటం విశేషం. అంతక్రితం ఏడాది (2018) తో పోల్చితే 2019 లో ఈ పెట్టుబలు స్వల్పంగా (2%) తగ్గినప్పటికీ... ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నట్లేనని చెప్పాలి. ముంబై మహానగర రీజియన్, ఢిల్లీ నేషనల్ కాపిటల్ రీజియన్ ప్రాంతాలు మొత్తం పెట్టుబడుల్లో 53% రాబట్టాయి. అంటే సుమారు 270 కోట్ల డాలర్ల పెట్టుబడులు ఈ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లోకి ప్రవహించాయి. ఆ తర్వాత ఐటీ కేంద్రాలు ఐన బెంగళూరు, పూణే నగరాలు కూడా ఆశాజనక పెట్టుబడులను రాబట్టాయి. బెంగళూరు లో పెట్టుబడులు 47% పెరిగి 615 మిలియన్ డాలర్ల కు చేరాయి. ఇక పూణే లో 210 వృద్ధితో 390 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

హైదరాబాద్ లో 440 మిలియన్ డాలరు...
దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా ఊపు మీద ఉంది. ఒకప్పుడు మన మార్కెట్లోకి విదేశి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు రావటం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ ఈ మధ్య హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు వస్తున్నాయి. 2018 లో అయితే ఒక్క మన నగరంలోనే ఇన్వెస్టర్లు 100 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టారు. అయితే, 2019 లో ఆ స్థాయిలో కాకపోయినా మెరుగైన పెట్టుబడులనే హైదరాబాద్ పొందిందని అనారోక్ తెలిపింది. 2019లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి 440 మిలియన్ డాలర్ల (సుమారు రూ 3,000 కోట్లు) ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఇటీవల మన హైదరాబాద్ లోని వేవ్ రాక్ అనే ఆఫీస్ బిల్డింగ్ ఏకంగా రూ 1,800 కోట్ల విలువను పొందింది. ఈ బిల్డింగ్ లో పేట్టుబడి పెట్టిన విదేశీ సంస్థ బాగా లాభపడినట్లు రియాల్టీ వర్గాల సమాచారం. అందుకే అలంటి అవకాశాల కోసం విదేశీ పెట్టుబడిదారులు హైదరాబాద్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని చెబుతున్నారు.

చెన్నై, కోల్‌కతాలకు షాక్...
దేశవ్యాప్తం రియల్ ఎస్టేట్ రంగం అక్సార్షణీయంగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో చెన్నై మహా నగరం పెట్టుబడులను ఆకర్షణచటం లో వెనుకబడి పోయింది. అలాగే తూర్పు భారతంలో వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కతా కూడా వెనుకంజలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ని స్థానిక పరిస్థితులు కూడా ఇందుకు కారణం అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2019 లో చెన్నై లో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు 2018 కన్నా 45% తగ్గి 370 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ పెట్టుబడులను మాత్రమే ఆకర్షించ గలిగింది. కోల్కతాలో అయితే అసలు ఒక్క డాలర్ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడి కూడా రాలేదని అనారోక్ తన నివేదిక లో వెల్లడించింది. ఇదిలా ఉండగా మొత్తం పెట్టుబడుల్లో కమర్షియల్ రియల్ ఎస్టేటులోకి 60% నికి పైగా పెట్టుబడులు రాగా... రిటైల్ సెక్టార్ సుమారు 20% పెట్టుబడులతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లోకి 10% లోపే పెట్టుబడులు వచ్చాయి.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications