ప్రయాణికులకు భారత రైల్వే శాఖ (Indian Railways) ఒక చేదు వార్తను అందించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తట్టుకోవడానికి వీలుగా రైలు టికెట్ ధరలను పెంచుతూ ఆదివారం (డిసెంబర్ 21) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంచిన ధరలు కేవలం కొన్ని విభాగాలకు మాత్రమే వర్తిస్తాయని, సామాన్యులపై తక్కువ ప్రభావం చూపేలా చర్యలు తీసుకున్నామని రైల్వే శాఖ వెల్లడించింది. రైల్వై శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం డిసెంబర్ 26 నుంచి మీ ప్రయాణ ఖర్చు ఎంత పెరగబోతుందంటే..

ఏ క్లాస్‌లో ఎంత పెరిగింది?
రైల్వే శాఖ విడుదల చేసిన కొత్త ధరల వివరాల ప్రకారం:
- ఆర్డినరీ క్లాస్ (Ordinary Class): 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి కిలోమీటర్ కు 1 పైసా చొప్పున ధర పెరుగుతుంది.
- మెయిల్/ఎక్స్‌ప్రెస్ (Mail/Express): నాన్-ఏసీ (Sleeper), ఏసీ క్లాస్ ప్రయాణికులకు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున అదనంగా ఛార్జ్ చేస్తారు.
- తక్కువ దూరం ప్రయాణించే వారికి ఊరట: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి టికెట్ ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు.
- సబ్ అర్బన్, సీజన్ టికెట్లు: లోకల్ ట్రైన్స్, మంత్లీ సీజన్ టికెట్ (MST) ధరలలో ఎలాంటి మార్పు లేదు.
మీ జేబుపై పడే భారం ఎంత?
ఈ కొత్త టికెట్ రేట్ల వల్ల మీ జేబుపై కొంత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 500 కిలోమీటర్ల దూరం నాన్-ఏసీ (Sleeper) లేదా ఏసీ క్లాస్‌లో ప్రయాణించాలనుకుంటే.. మీరు కేవలం రూ. 10 మాత్రమే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే దూరాన్ని బట్టి ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగానే ఉండబోతోంది. ఈ ఛార్జీల పెంపు ద్వారా రైల్వే శాఖకు అదనంగా రూ. 600 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా.
ధరలు పెంచడానికి కారణాలేంటి?
రైల్వే శాఖ తన నెట్‌వర్క్‌ను ఆధునీకరించడానికి, ప్రయాణికుల భద్రతను (Safety) మెరుగుపరచడానికి భారీగా ఖర్చు చేస్తోంది. రైల్వే ఆపరేషన్ ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. కేవలం ఉద్యోగుల జీతాలకే రూ. 1.15 లక్షల కోట్లు, పెన్షన్ల కోసం రూ. 60,000 కోట్లు ఖర్చవుతున్నాయి. అలాగే ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించే సిబ్బందిని పెంచడం వల్ల ఖర్చులు పెరిగాయని రైల్వే శాఖ తెలిపింది. ఇక వీటితోపాటు ఇటీవల పండుగ సీజన్ లో రద్దీని తట్టుకోవడానికి సుమారు 12,000 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు అధికారులు గుర్తుచేశారు.
ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయి?
ఈ కొత్త ధరలు డిసెంబర్ 26, 2025 నుంచి అమలులోకి వస్తాయి. ఆ తేదీ నుంచి మీరు IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసుకుంటే పెరిగిన ధరలు కనిపిస్తాయి. అయితే పెరిగిన ధరల గురించి రైల్వే శాఖ స్పష్టత ఇచ్చింది. సామాన్యులకు భారం పడకుండా, రైల్వే భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీనివల్ల ప్రయాణీకులు కొద్దిపాటి భారం మాత్రమే అదనంగా పడే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications