హోలీ పండుగ సందర్భంగా ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. మార్చి 2026లో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందర్భంగా 1,410 ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిమాండ్ పెరగడం వల్ల ఈ సంఖ్య 1,500 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ప్రధానంగా పండుగ సమయంలో ప్రయాణీకుల రద్దీని సజావుగా నిర్వహించడం, పెద్ద నగరాల మధ్య సులభమైన కనెక్టివిటీని అందించడం లక్ష్యంగా రూపొందించారు. గత సంవత్సరానికి పోలిస్తే.. 2025 హోలీ సందర్భంగా 1,144 ప్రత్యేక రైళ్లు నడిపినందున, ఈ సంవత్సరం ప్రణాళికలో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.
ప్రాంతీయ డిమాండ్‌ను పూరించడానికి, జోన్‌ల వారీగా ప్రత్యేక రైళ్ల పంపిణీ ప్రణాళిక తయారు చేశారు. సెంట్రల్ రైల్వే ప్రకారం, ముంబై-నాగ్‌పూర్, ముంబై-చిప్లున్, ముంబై-రత్నగిరి వంటి ప్రధాన గమ్యస్థానాలకు 209 హోలీ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వీటిలో ఏసీ, మిక్స్ రేక్, స్లీపర్, జనరల్ కోచ్‌లు, రిజర్వ్ చేయని రైళ్లు అందుబాటులో ఉంటాయి. స్టేషన్ల వద్ద అదనపు టికెట్ కౌంటర్లు, రద్దీ నిర్వహణ చర్యలు కూడా అమలు చేస్తున్నారు.

పశ్చిమ రైల్వే 231 ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. మార్చి 1-22, 2026 మధ్య ఉత్తర, తూర్పు భారతదేశం మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైతే మరిన్ని సర్వీసులు యాడ్ చేయడానికి రైల్వేలు సిద్ధంగా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే 160 ప్రత్యేక రైళ్లు రాజ్‌కోట్, విశాఖపట్నం, పాట్నా, సోలాపూర్, బిలాస్‌పూర్, హజ్రత్ నిజాముద్దీన్, లక్నో వంటి గమ్యస్థానాల కోసం ప్రణాళిక చేసింది. తిరుగు ప్రయాణ సర్వీసులు కూడా షెడ్యూల్ చేశారు.
ముంబై సెంట్రల్, ఉధ్నా, బాంద్రా టెర్మినస్, అహ్మదాబాద్, సూరత్ వంటి ప్రధాన స్టేషన్లలో ప్రత్యేక హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. వీటిలో సీటింగ్, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, ఫ్యాన్లు, లైటింగ్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లు ఉన్నాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) మరియు వాణిజ్య సిబ్బందిని అదనంగా మోహరించడం, అదనపు బుకింగ్ కౌంటర్లు, మొబైల్ టికెటింగ్, CCTV పర్యవేక్షణ వంటి భద్రతా చర్యలు అమలు చేయనున్నారు.
ఉత్తర రైల్వే దుర్గ్-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక హోలీ రైళ్లు నడుపుతోంది. రైలు 08751 మార్చి 1, 2, 2026 నడుస్తుంది, రైలు 08752 తిరిగి మార్చి 2, 3వ తేదీల్లో నడుస్తుంది. వీటిలో AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉన్నాయి, కట్ని, బిలాస్‌పూర్, రాయ్‌పూర్, ఆగ్రా, ఝాన్సీ, మధుర వంటి బహుళ స్టాప్‌లతో నవడనున్నాయి.
Indian Railways ప్రకారం.. హోలీ ప్రత్యేక రైళ్లు ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, ఇబ్బంది రహిత ప్రయాణాన్ని అందించడానికి, పండుగ కాలంలో రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం లక్ష్యంగా రూపొందించినట్లు తెలిపింది. ఈ రైళ్లు అన్ని ప్రధాన రైల్వే జోన్‌లలో ఉద్దేశించిన డిమాండ్‌ను తీర్చడంతో పాటు పండుగ ప్రదేశాలకు సులభమైన కనెక్టివిటీని కల్పిస్తాయి.


Click it and Unblock the Notifications