భారతీయ రైల్వేలు అంతకంతకూ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రయాణీకుల కోసం పలు సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. గంటల తరబడి క్యూలో నించొని టికెట్ తీసుకునే దగ్గర నుంచి ఫోన్ చేస్తే స్టేషన్ లో ఆహారం అందించే స్థాయికి తన సేవలను విస్తృతం చేశాయి. తాజాగా ఇప్పుడు మరో సౌకర్యాన్ని యాత్రికులకు అందించేందుకు IRCTC వడివడిగా అడుగులు వేస్తోంది. తద్వారా వ్యాపార విస్తరణకూ అవకాశం ఏర్పడుతోందని రైల్వే శాఖ భావిస్తోంది.

మరిన్ని రైళ్లలో..
రైలు ప్రయాణీకులు వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే అవకాశం త్వరలోనే కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వాట్సప్ నంబర్ +91 8750001323 ద్వారా కొన్ని రూట్లలో భోజనం డెలివరీ చేస్తోంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన వెబ్‌సైట్ www.catering.irctc.co.in తో పాటు IRCTC యాప్ 'ఫుడ్ ఆన్ ట్రాక్' ద్వారా ఇ-కేటరింగ్ సేవలను అందిస్తోంది. ఈ సదుపాయాన్ని ఇతర రైళ్లకూ విస్తరించాలని యోచిస్తోంది.

మరింత మందికి సేవలు:
"ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణీకులకు ఈ-కేటరింగ్ సేవలు అందించేందుకు.. వాట్సాప్ కమ్యూనికేషన్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్, సూచనల ఆధారంగా మరిన్ని రైళ్లలో వాట్సాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సేవలను IRCTC ప్రారంభిస్తుంది" అని సోమవారం ఒక ప్రకటనలో రైల్వేశాఖ తెలిపింది. ప్రస్తుతం రోజుకు సుమారు 50 వేల మందికి ఇ-కేటరింగ్ విధానంలో భోజనం అందిస్తుండగా.. వాట్సాప్ వినియోగం వల్ల ఈ సంఖ్య మరింత పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

యాప్ అవసరం లేకుండానే:
వాట్సాప్ ద్వారా ఈ-కేటరింగ్ సేవలను రెండు దశల్లో అమలు చేయాలని భావించారు. అయితే మొదటి దశలో www.ecatering.irctc.co.inపై క్లిక్ చేయడం ద్వారా ఇ-కేటరింగ్ సేవలను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇ-టికెట్‌ను బుక్ చేసుకునే కస్టమర్‌లకు బిజినెస్ వాట్సాప్ నంబర్ ద్వారా సందేశం వెళుతుంది. ఈ పద్ధతి ఇప్పటికే పలు రైళ్లలో అమలవుతుతోంది. యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా నేరుగా IRCTC ఇ-కేటరింగ్ వెబ్‌సైట్ ద్వారా స్టేషన్లలో అందుబాటులో ఉన్న, నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఇష్టమైన భోజనాన్ని బుక్ చేసుకోగలుగుతున్నారు.

AI సాయంతో..
ఇంటరాక్టివ్ వాట్సాప్ మీల్ బుకింగ్ మరియు డెలివరీ అనేది రెండవ దశ. ఈ విధానంలో ప్రయాణీకుల నుంచి ఇంటరాక్టివ్ టూ వే కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ను ప్లాట్ ఫారమ్‌గా ఉపయోగిస్తారు. ఇందులో ఇ-కేటరింగ్ సేవలకు సంబంధించిన అన్ని ప్రశ్నలనూ AI ఆధారిత చాట్‌బాట్ నిర్వహిస్తుండటంతో పాటు వారికి భోజనాన్ని సైతం బుక్ చేస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications