రైలు ప్రయాణికులకు అత్యవసర సమయంలో ఆసరాగా నిలిచే తత్కాల్ (Tatkal) టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే, IRCTC కీలక మార్పులు చేశాయి. 2026 నుంచి అమల్లోకి వస్తున్న ఈ కొత్త నిబంధనల ప్రధాన ఉద్దేశ్యం.. సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభంగా దొరికేలా చూడటం, అలాగే ఫేక్ అకౌంట్లు, సాఫ్ట్‌వేర్ బాట్‌ల ద్వారా జరిగే అక్రమ బుకింగ్‌లకు అడ్డుకట్ట వేయడం. మరి కొత్త రూల్స్ ప్రకారం తత్కాల్ బుకింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆధార్ కేవైసీ (KYC) తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం.. తత్కాల్ విండో ఓపెన్ కావడానికి ముందే ప్రయాణికుల IRCTC ఖాతా పూర్తిగా వెరిఫై అయి ఉండాలి. మీ ఖాతాను ఆధార్ లేదా ప్రభుత్వం గుర్తించిన ఇతర గుర్తింపు కార్డుతో లింక్ చేయడం (KYC) ఇప్పుడు తప్పనిసరి. ఇలా చేయడం వల్ల నకిలీ ఖాతాలను వ్యవస్థ నుంచి తొలగించవచ్చని రైల్వే భావిస్తోంది. వెరిఫికేషన్ పూర్తి కాని అకౌంట్ల నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేయడం ఇకపై సాధ్యం కాదు.
ఓటీపీ (OTP) వెరిఫికేషన్
ఏజెంట్ల పుణ్యమా తత్కాల్ వ్యవస్థ కూడా కమర్షియల్ గా మారిపోయింది. అందుకే భద్రతను మరింత కఠినతరం చేస్తూ.. ప్రతి బుకింగ్ ప్రయత్నంలోనూ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వచ్చేలా మార్పులు చేశారు. ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే టికెట్ జారీ అవుతుంది. దీనివల్ల ఖాతాదారునికి తెలియకుండా ఇతరులు లేదా ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్లు టికెట్లు బుక్ చేసే అవకాశం ఉండదు.
సెక్యూర్డ్ పేమెంట్
తత్కాల్ బుకింగ్ సమయంలో వచ్చే భారీ ట్రాఫిక్ ను తట్టుకునేలా IRCTC తన వెబ్‌సైట్, యాప్‌లో మరిన్ని పేమెంట్ గేట్‌వేలను (UPI, డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్) జోడించింది. అలాగే బుకింగ్ ప్యాటర్న్స్ ను గమనించడానికి అత్యాధునిక మానిటరింగ్ టూల్స్‌ను ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా ఒకేసారి ఎక్కువ టికెట్లు బుక్ చేసే అకౌంట్లను ఈ సిస్టమ్ గుర్తించి వెంటనే బ్లాక్ చేస్తుంది. దీనివల్ల అనధికారిక ఏజెంట్ల అక్రమాలకు చెక్ పడనుంది.
ప్రయాణికులు ఏం చేయాలి?
తత్కాల్ బుకింగ్ ప్రారంభమయ్యే సమయానికి ముందే (ఏసీ క్లాస్ కు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్‌కు ఉదయం 11 గంటలకు) మీ ప్రొఫైల్ వివరాలు, ప్రయాణికుల పేర్లు (Master List) సిద్ధంగా ఉంచుకోవాలి. మీ బ్యాంక్ వివరాలు , UPI పిన్ కూడా సిద్ధంగా ఉంటే సెకన్ల వ్యవధిలో బుకింగ్ పూర్తి చేయవచ్చు.
మొత్తంగా చూస్తే.. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు ముందస్తు వెరిఫికేషన్ వంటి పనులు కొంచెం భారంగా అనిపించినప్పటికీ.. అంతిమంగా ఇది సామాన్య ప్రయాణికులకు మేలు చేస్తుంది. దళారులు, ఫేక్ ఏజెంట్ల బెడద తగ్గి.. నిజమైన ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు దొరికే అవకాశాలు మెరుగవుతాయి. డిజిటల్ రైల్వే వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో ఇది కీలక అడుగు అని చెప్పొచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications