Train accidents: వామ్మో! భద్రతపై ఇండియన్ రైల్వేస్ అంత ఖర్చు పెట్టిందా..?
Train accidents: ఒడిశాలో జరిగిన ప్రమాదం వల్ల మొత్తం దేశంలోని రైల్వే వ్యవస్థ భద్రతపై ప్రజల్లో పలు అనుమానాలు మొదలవుతున్నాయి. భారీ ఆదాయం సంపాదించి పెడుతున్నా, భద్రత మాత్రం డొల్లేనని పెదవి విరుస్తున్నారు. అయితే ప్రభుత్వ గణాంకాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గత ఐదేళ్లలో కేవలం సేఫ్టీ విషయమై ఇండియన్ రైల్వే ఖర్చు చేసినది ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టక మానరు. దీనిపై అధికారంలోని BJP మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నిప్పు రాజుకుంది.
బాలాసోర్ ట్రిపుల్ రైలు దుర్ఘటనలో దాదాపు 275కి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో వెయ్యి మందికి మించి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో రైల్వేలపై సర్కారు పెట్టిన ఖర్చు విషయమై.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికను కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే
ఉదహరించారు. దీనిపై ఇప్పటికే ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. అయితే త్వరలోనే రైల్వే శాఖ ఈ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

2017-2018 మరియు 2021-22 మధ్య భద్రతా చర్యల కోసం భారతీయ రైల్వే లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వాటి ప్రకారం చూస్తే ట్రాక్ పునరుద్ధరణ వ్యయంలో స్థిరమైన పెరుగుదల నమోదైంది. "2022 CAG నివేదిక ప్రకారం రాష్ట్రీయ రైల్ సంరక్షా కోష్ (RRSK) కోసం వెచ్చించే నిధుల్లో 79 శాతం భారీగా కోత విధించారు. ఏటా 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని బడ్జెట్ ప్రజెంటేషన్ సందర్భంగా చెప్పినప్పటికీ అది జరగలేదు. ట్రాక్ పునరుద్ధరణ పనులకు అవసరమైన నిధులు ఎందుకు కేటాయించలేదు" అని ఖర్గే తన లేఖలో ప్రశ్నించారు.
RRSK యొక్క చెల్లుబాటును ఫిబ్రవరి 2022లో మరో ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం పొడిగించింది. 2017-18లో దాదాపు 9 వేల కోట్లుగా ఉన్న ట్రాక్ పునరుద్ధరణ వ్యయం 2020-21లో 13 వేల కోట్లకు, 2021-22లో 16 కోట్లకు పైగా పెరిగిందని CAG నివేదిక పేర్కొంది. అంటే మొత్తం మీద కేవలం ట్రాక్ పునరుద్ధరణ కేసమే గత ఐదేళ్లలో 58 వేల కోట్లకు మించి సర్కారు వెచ్చించింది.


Click it and Unblock the Notifications