Ticket Booking rules: మీరు లేదా మీ ఫ్యామిలీ ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారా... అయితే ఈ వార్త మీకు ఉపయోగపడొచ్చు. అవును, ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టికెట్ బుకింగ్‌కు సంబంధించిన రూల్స్ గతంలో కంటే ఇప్పుడు మరింత కఠినంగా చేసింది. ఈ మార్పులు ఎమర్జెన్సీ కోటా రిజర్వేషన్ కింద చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద ప్రజలు నిజంగా ఎమర్జెన్సీ లేకున్న కూడా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారని రైల్వే మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి. దింతో ఈ ఫిర్యాదులు మేరకు రూల్స్ మార్చేసింది.

ఎమర్జెన్సీ కోటా కోసం కొత్త రూల్స్ : ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు బుక్ చేసేందుకు ట్రావెల్ ఏజెంట్ల నుండి ఎలాంటి డిమాండ్లు ఉన్న అంగీకరించవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ 17 రైల్వే జోన్‌లను ఆదేశించింది. అయితే 2011 సంవత్సరంలో రైల్వేలు ఈ కోటాకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని కోరింది. కొత్త నిబంధనల ప్రకారం, ఎమర్జెన్సీ కోటా కోసం వ్రాతపూర్వక అభ్యర్థనను గెజిటెడ్ అధికారి సంతకంతో మాత్రమే అంగీకరిస్తారు. ఇందుకు అభ్యర్థన చేసే వ్యక్తి పేరు, హోదా, ఫోన్ నంబర్ అలాగే ప్రయాణీకులలో ఒకరి మొబైల్ నంబర్‌ను అందించాలి.
అభ్యర్థన రిజిస్టర్‌లో ఎంట్రీ : ప్రతి అధికారి, సెక్షన్ ఇంకా ఫెడరేషన్ దీని కోసం ఒక రిజిస్టర్ మైంటైన్ చేయాలనీ రైల్వేలు ఆదేశించాయి. ఈ రిజిస్టర్‌లో అత్యవసర కోటాకు సంబంధించిన అన్ని అభ్యర్థనల పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. ఈ సమాచారంలో ప్రయాణ తేదీ, ప్రదేశం, అభ్యర్థించిన వ్యక్తి కారణం మొదలైనవి ఉంటాయి. రిజిస్టర్ డైరీ నంబర్ కూడా అభ్యర్థనపై వ్రాసి ఉంటుంది. ప్రయాణీకుల గురించి సరైన ఇంకా స్పష్టమైన సమాచారాన్ని అందించడం అభ్యర్థన పంపే వ్యక్తి బాధ్యత.
ట్రావెల్ ఏజెంట్లపై నిషేధం: ట్రావెల్ ఏజెంట్ల నుండి వచ్చే అభ్యర్థనలను అంగీకరించబోమని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది. అలాగే తప్పుడు అభ్యర్థనలను నివారించాలని అధికారులకు సూచించారు. రైల్వేలు కూడా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) పై క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని ఆదేశించాయి. టికెట్ బ్రోకర్లు అండ్ రిజర్వేషన్ ఆఫీస్ ఉద్యోగుల మధ్య కుమ్మక్కును నివారించడానికి ఈ దర్యాప్తు నిర్వహించబడుతుంది. ఇది కాకుండా, అన్ని రిక్వెస్ట్ లేటర్లను ప్రయాణ తేదీ నుండి మూడు నెలల వరకు భద్రంగా ఉంచాలని కోరారు. ఈ కొత్త నిబంధనలతో అత్యవసర కోటా దుర్వినియోగాన్ని ఆపడం ఇంకా టికెట్ బుకింగ్‌ను మరింత ఖచ్చితం చేయడం రైల్వేల ముఖ్య ఉద్దేశం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications