వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే AI.. ఇండియన్ రైల్వేస్ సూపర్ అప్‌డేట్!

మీరు తరచుగా రైలు ప్రయాణాలు చేస్తుంటారా? టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే.. అది కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియక టెన్షన్ పడుతుంటారా? అయితే మీకోసమే ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. 2026 ఆగస్ట్ నుండి రైల్వే శాఖ తన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) లో అత్యంత భారీ మార్పులు చేయబోతోంది. దాదాపు 40 ఏళ్ల నాటి పాత సాంకేతికతకు స్వస్తి పలికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో కూడిన సరికొత్త బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను తీసుకురాబోతోంది. దీనివల్ల ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్స్ (train tickets) బుకింగ్ మరింత వేగంగా, స్మార్ట్‌గా మారనుంది.

Indian Railways New PRS Reservation System August 2026 AI Ticket Booking

40 ఏళ్ల నాటి పాత సిస్టమ్‌కు గుడ్ బై!

ప్రస్తుతం మనం వాడుతున్న రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌ను 1986లో ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా ఇందులో చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ, పెరుగుతున్న డిజిటల్ డిమాండ్‌కు అనుగుణంగా ఇది సరిపోవడం లేదు. ప్రస్తుతం దేశంలో దాదాపు 88 శాతం టికెట్ బుకింగ్స్ ఆన్‌లైన్ లేదా డిజిటల్ ఛానెల్స్ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే, సర్వర్ డౌన్ అవ్వడం, పేమెంట్ ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు లేకుండా భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేలా ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ సిస్టమ్‌ను డిజైన్ చేశారు.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల రైల్ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించారు. ఈ సరికొత్త మార్పు వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఆదేశించారు.

వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ముందే చెప్పేసే AI!

ఈ కొత్త సిస్టమ్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే.. AI పవర్డ్ వెయిటింగ్ లిస్ట్ ప్రెడిక్షన్. మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటే, అది కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎంత శాతం ఉందో ఈ ఏఐ టూల్ ముందే అంచనా వేస్తుంది. గతంలో ఈ అంచనాల ఖచ్చితత్వం (Accuracy) కేవలం 53 శాతంగానే ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని ఏకంగా 94 శాతానికి పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు తమ జర్నీ ప్లాన్స్‌ను ముందే స్పష్టంగా డిసైడ్ చేసుకోవచ్చు.

దూసుకుపోతున్న 'రైల్‌వన్' (RailOne) యాప్

రైల్వే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో భాగంగా 2025 జూలైలో లాంచ్ చేసిన 'రైల్‌వన్' యాప్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. కేవలం ఏడాది లోపే ఈ యాప్ ఏకంగా 3.5 కోట్ల డౌన్‌లోడ్‌లను దాటేసింది.

  • ఈ ఒక్క యాప్ ద్వారానే మీరు కన్ఫర్మ్ , అన్‌రిజర్వ్‌డ్ (జనరల్) ట్రైన్ టికెట్స్ (train tickets) బుక్ చేసుకోవచ్చు.
  • లైవ్ రైన్ రన్నింగ్ స్టేటస్, కోచ్ పొజిషన్, ప్లాట్‌ఫారమ్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  • అవసరమైతే టికెట్ క్యాన్సిలేషన్ , ఫిర్యాదులను కూడా ఇందులోనే సబ్మిట్ చేయవచ్చు.

ప్రస్తుతం ఈ యాప్ ద్వారా ప్రతిరోజూ దాదాపు 9.29 లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇందులో 7.2 లక్షల అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు, 2.09 లక్షల రిజర్వ్‌డ్ టికెట్లు ఉంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+