రైలు ప్రయాణికులకు అలర్ట్! లగేజీపై కొత్త రూల్స్.. లిమిట్ దాటితే జరిమానా తప్పదు!
భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజూ లక్షలాది మంది సామాన్యులు, వ్యాపారులు రైలు ప్రయాణాలపై ఆధారపడతారు. అయితే ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ లగేజీ నిబంధనలలో భారీ మార్పులు చేస్తోంది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. విమాన ప్రయాణాల తరహాలో రైళ్లలో కూడా లగేజీని తనిఖీ చేసి, పరిమితి మించిన వారికి ఛార్జీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు.

ఏ క్లాస్‌లో ఎంత లగేజీ ఫ్రీ?
రైల్వే శాఖ విడుదల చేసిన తాజా పట్టిక ప్రకారం.. వివిధ క్లాసుల్లో ప్రయాణించే వారికి అనుమతించబడిన ఉచిత లగేజీ, మ్యాగ్జిమమ్ లగేజీ లిమిట్స్ ఇలా ఉన్నాయి.
AC ఫస్ట్ క్లాస్ (AC First Class): ప్రయాణికులు 70 కేజీల వరకు సామాన్లను ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఎక్స్‌ట్రా ఛార్జీ చెల్లించి గరిష్టంగా 150 కేజీల వరకు తీసుకెళ్లొచ్చు.
AC 2 టైర్ లేదా ఫస్ట్ క్లాస్ (AC 2 Tier / First Class): ఇందులో 50 కేజీల వరకు ఉచితంగా అనుమతిస్తారు. అదనపు ఛార్జీలతో గరిష్టంగా 100 కేజీల వరకు సామాన్లను తీసుకువెళ్లొచ్చు.
AC 3 టైర్ లేదా చైర్ కార్ (AC 3 Tier / Chair Car): ప్రయాణికులు 40 కేజీల వరకు సామాన్లను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ తరగతిలో గరిష్ట పరిమితి కూడా 40 కేజీలుగానే నిర్ణయించారు.
స్లీపర్ క్లాస్ (Sleeper Class): ఇందులో 40 కేజీల వరకు ఉచిత లగేజీకి అనుమతి ఉంటుంది. ఎక్స్‌ట్రా ఛార్జీ చెల్లిస్తే గరిష్టంగా 80 కేజీల వరకు అనుమతిస్తారు.
సెకండ్ క్లాస్ - జనరల్ (Second Class): ప్రయాణికులు 35 కేజీల వరకు ఉచితంగా సామాన్లను తీసుకెళ్లొచ్చు. అదనపు రుసుముతో గరిష్టంగా 70 కేజీల వరకు అనుమతి ఉంటుంది.
లిమిట్ దాటిన తర్వాత: ఉచిత పరిమితి దాటిన తర్వాత.. గరిష్ట పరిమితి వరకు లగేజీని తీసుకెళ్లాలంటే సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
లగేజీ సైజుపై కూడా నిబంధనలు!
కేవలం బరువే కాదు, మీరు తీసుకెళ్లే సామానుల సైజు కూడా నిర్ణీత పరిమితిలో ఉండాలి.
ట్రంకులు, సూట్‌కేసులు లేదా బాక్సులు గరిష్టంగా 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ (పొడవు x వెడల్పు x ఎత్తు) పరిమాణంలో ఉండాలి. ఒకవేళ ఈ సైజు కంటే పెద్దగా ఉంటే.. వాటిని కంపార్ట్‌మెంట్‌లో ఉంచడానికి అనుమతించరు. వాటిని ప్రత్యేకంగా బుక్ చేసి బ్రేక్ వ్యాన్ లేదా పార్సిల్ వ్యాన్ లో పంపాల్సి ఉంటుంది.
ముఖ్యమైన ఇతర నిబంధనలు
వ్యాపార వస్తువులు (Merchandise): వ్యక్తిగత లగేజీగా వ్యాపార వస్తువులను కంపార్ట్‌మెంట్‌లో తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది.
బోర్డింగ్ పాస్ తరహాలో టికెట్:డిసెంబర్ 2026 నాటికి ఎంపిక చేసిన ప్రధాన స్టేషన్లలో విమానాశ్రయాల తరహాలో 'బోర్డింగ్ పాస్' విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. లగేజీని ఎలక్ట్రానిక్ యంత్రాలతో తూకం వేసిన తర్వాతే ప్లాట్‌ఫారమ్ మీదకు అనుమతిస్తారు.
సెక్యూరిటీ చెక్: లగేజీ పరిమితిని పర్యవేక్షించడమే కాకుండా ప్రయాణికుల భద్రత కోసం డిజిటల్ స్కానింగ్ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications