Indian Railway: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇంటి వద్దకే రైల్వే పార్శిళ్లు..!
భారతీయ రైల్వే వినియోగదారులకు అత్యుత్తమమైన సేవలు అందించేందుకు నిరంతరం పని చేస్తూనే ఉంది. తాజాగా వినియోగదారుల ఇంటి వద్దకే పార్సిల్ సేవలందించేందుకు 'ఘర్ సే ఘర్ తక్' పేరిట సరికొత్త డోర్ -టు- డోర్ సర్వీసును ప్రారంభించినట్లు రైల్వే ప్రకటించింది. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పుణె నగరాల్లో ఈ సేవలను మొదలు పెట్టినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విధానంలో వినియోగదారులు తమ పార్సిల్‌ను పంపడానికి రైల్వే లాజిస్టిక్స్ ఆఫీస్‌కి వెళ్లకుండా 'రైల్ పార్సిల్ యాప్' ద్వారా సులభంగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
ప్రైవేట్ లాజిస్టిక్స్ సంస్థలు ఇంటి వద్ద పార్సిల్ సేకరించి, తమ లోకల్ లాజిస్టిక్స్ హబ్‌కు పంపిస్తారు. అక్కడ పార్సిల్ బరువు, కొలతలు సరిచూసి, అవసరమైన బార్‌కోడింగ్, అదనపు ప్యాకింగ్, లేబులింగ్ పూర్తి చేస్తారు. సార్టింగ్ పూర్తయిన తర్వాత, ఆ పార్సిల్‌ను షెడ్యూల్ చేసిన రైలు బయలుదేరే స్టేషన్‌లోని రైల్వే పార్సిల్ ఆఫీస్‌కు తీసుకెళ్లి అధికారులకు చేరవేస్తారు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ పాత్ర తాత్కాలికంగా ఆగిపోతుంది. భారతీయ రైల్వే ఆ పార్సిల్‌ను నిర్దేశిత రైలు పార్సిల్ వ్యాన్‌లో లోడ్ చేసి గమ్యస్థాన స్టేషన్‌కు రవాణా చేస్తారు. పార్సిల్ గమ్యస్థానానికి చేరుకోగానే, అక్కడి ప్రైవేట్ లాజిస్టిక్స్ భాగస్వామి రైల్వే పార్సిల్ ఆఫీస్ నుంచి దానిని తీసుకుంటారు.

అక్కడినుంచి వారి లోకల్ డెలివరీ హబ్‌కు చేర్చి, చివరిగా లాస్ట్ మైల్ డెలివరీ చేర్చి కస్టమర్ కు అందజేస్తారు. రైలు బయలుదేరడానికి 15 రోజుల ముందు నుంచి ఒక రోజు ముందు వరకు బుకింగ్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. పండుగల వేళ పార్సిల్ కోచ్‌ల రౌండ్- ట్రిప్ బుకింగ్‌లపై 25శాతం రాయితీ ఇస్తామని రైల్వే పేర్కొంది. కాగా రైల్వే ఈ మధ్యే కౌంటర్లలో తీసుకున్న రైల్వే టికెట్ ప్రయాణికులకు కూడా ఇన్సూరెన్స్ ను వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకున్న వారికే ఉండేది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు 45 పైసలు ఛార్జీ చేయనున్నారు. 45 పైసలతో రూ.10 లక్షల కవరేజీ రానుంది.
మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవించిన సందర్భంలో రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ అందించబడుతుంది. బీమా చేయబడిన రైలు ప్రయాణికుడికి శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షల వరకు చెల్లిస్తారు. గాయం, ఆసుపత్రి చికిత్స విషయంలో చికిత్స కోసం రూ. 2 లక్షల వరకు చెల్లిస్తారు. మృతదేహ రవాణాకు రూ. 10,000. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణ బీమా పొందడానికి, ప్రయాణికులు తమ మొబైల్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది


Click it and Unblock the Notifications