Indian Railway: 45 పైసలతో రూ.10 లక్షల బీమా.. కౌంటర్‎లో టికెట్ కొన్నా బీమా వర్తిస్తుంది..!

భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడికి బీమా కల్పించేందుకు నిర్ణయించింది. కౌంటర్లలో జారీ చేసిన టిక్కెట్లకు కూడా ప్రయాణ బీమా కవరేజీని విస్తరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా, ప్లాట్‌ఫారమ్‌ల వద్ద రిజర్వ్డ్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే ఐచ్ఛిక ప్రయాణ బీమా సౌకర్యాన్ని విస్తరించింది. అక్టోబర్ 27, 2026 నుంచి రైలు ప్రయాణికులు రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కొనుగోలు చేసిన టిక్కెట్లకు ప్రయాణ బీమాను పొందగలరు. ఇంతకుముందు ఈ సౌకర్యం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న రిజర్వ్డ్ టిక్కెట్లకు మాత్రమే అందుబాటులో ఉండేది.

అక్టోబర్ 6, 2026న, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం కౌంటర్లలో బుక్ చేసుకున్న రైలు టిక్కెట్లకు కూడా ప్రయాణ బీమా కవరేజీని విస్తరించాలని భారతీయ రైల్వేను ఆదేశించింది. అక్టోబర్ 27, 2026 నుంచి కౌంటర్లలో కొనుగోలు చేసిన టిక్కెట్లపై ప్రయాణ బీమా ఐచ్ఛికాన్ని అమలు చేయాలని అన్ని జోనల్ రైల్వేలను ఆదేశించారు. దీనిని అమలు చేసే బాధ్యతను సుప్రీంకోర్టు నేరుగా రైల్వే బోర్డుకు అప్పగించింది. రైలు టిక్కెట్లను ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా బుక్ చేసుకుంటారు. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం, ఐఆర్‌సిటిసిలో ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో భారత పౌరులకు, కన్ఫర్మ్డ్, పార్ట్లీ కన్ఫర్మ్డ్, మరియు ఆర్‌ఏసి (RAC) టిక్కెట్లకు మాత్రమే బీమా సౌకర్యం అందించబడుతుంది.

Insurance

మంగళవారం నుంచి రైలు ప్రయాణికులు 45 పైసల (పన్నులతో సహా) భీమాను కొనుగోలు చేయగలరు. ఈ పథకం అన్ని తరగతులలోని కన్ఫర్మ్డ్, పాక్షికంగా కన్ఫర్మ్డ్, ఆర్ఏసీ (RAC) టిక్కెట్లకు వర్తిస్తుంది. ముఖ్యంగా రిజర్వేషన్ లేని జనరల్ టిక్కెట్లు లేదా సబర్బన్ రైళ్లు ఈ ఐచ్ఛిక పథకం పరిధిలోకి రావు. మృతునికి/కుటుంబానికి లేదా మృతుని చట్టపరమైన వారసులకు ఇవ్వబడే బీమా మొత్తం ఎలా ఉంటుందంటే. రైలు ప్రమాదాలు లేదా అవాంఛనీయ సంఘటనల సందర్భంలో రైలు ప్రయాణికులు ప్రయాణ బీమా, అంటే అదనపు ఆర్థిక రక్షణను పొందగలరు. ఈ భీమా మరణం, శాశ్వత సంపూర్ణ వైకల్యం, పాక్షిక వైకల్యం, గాయం కారణంగా ఆసుపత్రి ఖర్చులు, మృతదేహ రవాణాను కవర్ చేస్తుంది.

మరణం లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవించిన సందర్భంలో రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీ అందించబడుతుంది. బీమా చేయబడిన రైలు ప్రయాణికుడికి శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షల వరకు చెల్లిస్తారు. గాయం, ఆసుపత్రి చికిత్స విషయంలో చికిత్స కోసం రూ. 2 లక్షల వరకు చెల్లిస్తారు. మృతదేహ రవాణాకు రూ. 10,000. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయాణ బీమా పొందడానికి, ప్రయాణికులు తమ మొబైల్ నంబర్‌ను అందించాల్సి ఉంటుంది. ప్రయాణికులు ప్రీమియంను డిజిటల్ పద్ధతిలో చెల్లించడానికి అనుమతి ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ పోర్టల్ ద్వారా ఇ-టికెట్ బుక్ చేసుకునే కన్ఫర్మ్డ్/RAC రైల్వే ప్రయాణికుల కోసం, సెప్టెంబర్ 1, 2026 నుండి ఒక్కో ప్రయాణికుడికి రూ. 0.92 ప్రీమియంతో ఒక ఐచ్ఛిక ప్రయాణ బీమా పథకం ప్రారంభించింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+