Indian railways: భారతీయ రైల్వేస్ కేవలం సేవల ద్వారా మాత్రమే ఆదాయాన్ని సంపాదిస్తుందని మనం అనుకుంటుంటాం. అయితే ఇతర మార్గాల ద్వారా ఎలా, ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరు నెలల కాలంలో..
Indian railways తన దగ్గర ఉండే స్క్రాప్ విక్రయం ద్వారా రూ.2,500 కోట్లు ఆదాయాన్ని పొందినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెుదటి 6 నెలల్లో వచ్చిన ఆదాయం మాత్రమే ఇది. గత ఆర్థిక సమయంలో ఇదే కాలంతో పోల్చితే ఇది దాదాపు 28.91% ఎక్కువని సంస్థ నివేధించింది.
ఆదాయ లక్ష్యం..
2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వేలు పాత వస్తువుల విక్రయం ద్వారా రూ.4,400 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేలం ద్వారా ఆన్‌లైన్‌లో దీనిని చేపడుతున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. పనిచేయని స్క్రాప్ అమ్మటం అనేది నిరంతర ప్రక్రియగా ఉంది.
సరుకు రవాణా రైలు రాక్స్..
రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2022-23లో ఐరన్ స్క్రాప్ 3,93,421 మెట్రిక్ టన్నులకు విక్రయించబడింది. రైల్వే బోర్డు సాధారణంగా నిర్మాణ, గేజ్ మార్పిడి ప్రాజెక్ట్‌లలో ఉపయోగించే మెటీరియల్‌లు పని చేయనప్పుడు వాటిని స్క్రాప్‌గా విక్రయిస్తుంది. ఇదే క్రమంలో దేశంలో మెుదటి సారిగా హిండాల్కో తయారు చేసిన అల్యూమినియం ఫ్రైట్ రైలు ర్యాక్‌లను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు.

లైట్ వెయిట్ అల్యూమినియం రాక్స్..
అల్యూమినియం రాక్‌లు సరుకు రవాణాను ఆధునీకరించే లక్ష్యంతో అభివృద్ధి చేయబడ్డాయి. భారతీయ రైల్వేలకు అధిక కార్బన ఉద్ఘారాలను తగ్గిస్తుందని హిండాల్కో అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ రాక్‌లు ప్రస్తుతం ఉన్న రాక్‌ల కంటే 180 టన్నుల తేలికైనవి. అయితే ఇది 5-10% ఎక్కువ బరువును మోయగలవు. ఇది భవిష్యత్తులో స్క్రాప్ అమ్మకాలను తగ్గిస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications