Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త.. టిక్కెట్ ధరలు 25 శాతం తగ్గింపు.. పూర్తి వివరాలు
Railways: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక రూట్లలో వందేభారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. అసలే అన్నింటి రేట్లు పెరిగి ఇబ్బందులు పడుతున్న ప్రజలు అధిక ఛార్జీలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల నుంచి ఆదరణ తగ్గటంతో రైళ్లలో ఏసీ చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్ క్లాసుల టికెట్ ధరలను 25% వరకు తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి జోనల్ రైల్వేలకు అధికారం కల్పించింది. విస్టాడోమ్ కోచ్‌లతో సహా AC సిట్టింగ్ వసతి ఉన్న అన్ని రైళ్ల ఈ పథకం వర్తిస్తుంది. అలాగే వెంటనే అమలు చేయబడుతుంది.

తాజా నిర్ణయం ద్వారా బేర్‌ఫేర్‌పై 25% వరకు తగ్గింపు లభించనుంది. అయితే రిజర్వేషన్ ఫీజులు, సూపర్-ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లు, GST మొదలైన ఛార్జీలు విడిగా విధించబడతాయి. గడచిన 30 రోజుల్లో 50 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లును తాజా స్కీమ్ కింద పరిగణించబడతాయి. అయితే పోటీతత్వ రవాణా మార్గాల ధరలు తగ్గింపును నిర్ణయించడానికి బెంచ్‌మార్క్‌గా పనిచేస్తాయి. అయితే ఈ ప్రకటనకు ముందు చేసుకున్న రిజర్వేషన్లకు రూల్స్ వర్తించవని తెలుస్తోంది. వారికి ఎలాంటి డబ్బు వాపసులు లభించవు. ఖాళీగా వెళుతున్న రైళ్లలో ఆక్యుపెన్సీ పెంచటమే తాజా నిర్ణయం వెనుక అసలు కారణమని వెల్లడైంది.

అయినప్పటికీ చాలా మంది పౌరులు మంత్రిత్వ శాఖ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరిగి చెల్లించలేని ఛార్జీల నిబంధనలపై. సాధారణ రైళ్లతో పోలిస్తే వందే భారత్ రైళ్లకు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. ఇది చాలా మంది ప్రయాణికులకు ప్రతికూలతను కలిగిస్తుందని సోషల్ మీడియాలో వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications