Train tickets: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై వీరికి జీవితాంతం ఫ్రీ జర్నీ!

భారతదేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే వీరులకు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప గౌరవాన్ని ప్రకటించింది. గ్యాలంట్రీ అవార్డులు పొందిన సైనికులు , వారి కుటుంబ సభ్యులకు భారతీయ రైల్వేలో జీవితాంతం ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తూ గురువారం కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్లాలంటే భారీ ధరలు పెట్టి ట్రైన్ టికెట్స్ (Train tickets) కొంటాం. కానీ, ఇప్పుడు ఈ ప్రత్యేక విభాగం వారికి ఆ అవసరం ఉండదు.

Indian Railways announces lifetime free travel and free Train tickets for gallantry award winners and family

ఎవరెవరు అర్హులు? (Eligibility Details)

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ క్రింది గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు ఉచిత ప్రయాణానికి అర్హులు..

  • సేన మెడల్ (Sena Medal) పొందిన వారు.
  • నౌ సేన మెడల్ (Nau Sena Medal) గ్రహీతలు.
  • వాయు సేన మెడల్ (Vayu Sena Medal) గ్రహీతలు.

వీరితో పాటు వారి జీవిత భాగస్వాములు (భర్త లేదా భార్య) కూడా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఒకవేళ అవార్డు గ్రహీత మరణిస్తే, వారి భార్య లేదా భర్త (పునర్వివాహం చేసుకోనంత వరకు) ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. అలాగే, పెళ్లి కాని అమరవీరుల తల్లిదండ్రులు కూడా ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఏ కోచ్‌లలో ప్రయాణించవచ్చు?

అర్హులైన వారు ఒక తోడు (Companion) తో కలిసి భారతీయ రైల్వేలోని ఈ క్రింది తరగతుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు..

  1. ఫస్ట్ క్లాస్ (First Class)
  2. 2 AC (సెకండ్ ఏసీ)
  3. AC చైర్ కార్ (AC Chair Car)

అగ్నివీర్‌లు, మాజీ సైనికులకు ఉద్యోగాల జాతర

ఉచిత ప్రయాణంతో పాటు, పదవీ విరమణ చేసిన సైనికులకు , అగ్నివీర్‌లకు రైల్వేలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇందుకోసం ఇండియన్ ఆర్మీ , రైల్వే శాఖ మధ్య ఒక చారిత్రక ఒప్పందం కుదిరింది.

  • రిజర్వేషన్లు: లెవల్-1 పోస్టుల్లో మాజీ సైనికులకు 20%, అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్ కల్పించారు. లెవల్-2 , అంతకంటే పై స్థాయి పోస్టుల్లో వరుసగా 10% , 5% కోటాను కేటాయించారు.
  • భారీ వేకెన్సీలు: 2024 , 2025 సంవత్సరాల్లో మొత్తం 14,788 పోస్టులను మాజీ సైనికుల కోసం కేటాయించినట్లు రైల్వే శాఖ తెలిపింది.
  • కాంట్రాక్ట్ నియమకాలు: రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు మాజీ సైనికులను 'పాయింట్స్‌మెన్ (Pointsmen)'గా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని నిర్ణయించారు.

దేశ సేవలో నిమగ్నమైన వారిని గౌరవించడం , వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం కోసం రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంతో ప్రశంసనీయం. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఈ అవార్డులు పొంది ఉంటే, వెంటనే రైల్వే వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు చూసుకుని ఈ ప్రయోజనాన్ని పొందండి. ఇకపై వారు ఎక్కడికైనా వెళ్లాలంటే పాత పద్ధతిలో ట్రైన్ టికెట్స్ (Train tickets) కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+