Indian Railways: దేశంలో చాలా మంది తమ ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలను వినియోగిస్తుంటారు. తక్కువ ఖర్చుతో పాటు ప్రయాణ వెసులుబాటును అందించటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
అయితే ఇటీవల దేశవ్యాపంగా రైల్వే ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఒడిశాలో జరిగిన అతిపెద్ద ప్రమాదం చాలా మంది ప్రాణాలను బలిగొంది. ఈ క్రమంలో రైల్వే బోర్డు ప్రమాద బాధితులకు అందించే పరిహారాన్ని పెంచాలని నిర్ణయించింది. 2012-13 తర్వాత తొలిసారిగా రైల్వే బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంది.

రైలు లేదా మనుషుల లెవెల్ క్రాసింగ్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్-గ్రేషియాను పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో రూ.50 వేలుగా ఉన్న పరిహారాన్ని తాజాగా రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. అలాగే రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు గతంలో చెల్లిస్తున్న రూ.25 వేల పరిహారాన్ని రూ.2.50 లక్షలకు పెంచింది. తక్కువ తీవ్రత కలిగిన గాయాలకు గురైతే గతంలో ఇస్తున్న రూ.5 వేల పరిహారానికి బదులు రూ.50,000 చెల్లించాలని నిర్ణయించింది.
అంతేకాకుండా మానవ సహిత లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద రైల్వే ప్రాథమిక బాధ్యత కారణంగా ప్రమాదాలకు గురైన రహదారి వినియోగదారులకు సవరించిన ఎక్స్-గ్రేషియా ఉపశమనాన్ని సర్క్యులర్ పొడిగించింది. అలాగే ఉగ్రవాద దాడులు, హింసాత్మక దాడులు, రైలు దోపిడీలు వంటి నేరాలుగా వర్గీకరించారు. ఈ సందర్భాల్లో ప్రాణాంతక గాయాలతో బాధపడే ప్రయాణికులపై ఆధారపడిన వారికి రూ.1.5 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. 50,000, స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ.5,000 అందించాలని బోర్డు నిర్ణయించింది.
రైలు ప్రమాదాల కారణంగా 30 రోజులకు మించి ఆసుపత్రిలో చికిత్స పొందే ప్రయాణికులకు రోజుకు రూ.3,000 చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మెుత్తం ప్రతి 10 రోజుల వ్యవధి ముగింపులో లేదా డిశ్చార్జ్ అయిన తర్వాత ఏది ముందు జరిగితే అప్పుడు విడుదల చేయబడుతుంది. అలాగే అవాంఛనీయ సంఘటనల సమయంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు ఆసుపత్రిలో చేరిన ఆరు నెలల వరకు ఇలాంటి పరిస్థితులలో రోజుకు రూ.1,500 అందుకుంటారు. ఆ తర్వాత ఐదు నెలలు రోజుకు రూ.750 చొప్పున పొందుతారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications