IT News: ఆ టెక్కీల వెనుక పరిగెడుతున్న బ్యాంకులు.. ఉద్యోగ ఆఫర్లు..!!
IT News: బ్యాంకింగ్ రంగం పూర్తిగా డిజిటలేజేషన్ అయిన తర్వాత సేవల్లో ఇటీవల ప్రభుత్వ బ్యాంకులు సమస్యలను చూశాయి. ఇది వాటికి ఆర్థికంగా పెద్ద నష్టాలను కలిగించటంతో కళ్లు తెరిచాయి.
ఈ క్రమంలో ప్రభుత్వ రంగం బ్యాంకులు తమ బ్యాంకింగ్ అవసరాల కోసం సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవాలని చూస్తున్నాయని టాప్ బ్యాంకర్లు వెల్లడించారు. ఈ నెలలో యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో తలెత్తిన సమస్యలతో డొల్లతనం బయటపడింది. దీంతో కోర్ అండ్ ఫ్రంట్-ఎండ్ సిస్టమ్‌లను మరింత బలోపేతం చేయడానికి.. డిజిటల్ అండ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నాయి.

నవంబర్ 10న యూకో బ్యాంక్ IMPS సర్వర్‌తో సమస్య బయటకు రాగా.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బాబ్ వరల్డ్ యాప్ మోసాలపై రిజర్వు బ్యాంక్ కన్నెర్రచేసింది. అదేవిధంగా దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వ్యాపార అవసరాల కోసం టెక్ అండ్ డిజిటల్ నిపుణులను నియమించుకోవాలని చూస్తోంది. అయితే ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఈ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు అధికంగా డిమాండ్ ఉంది. పెద్దపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం నైపుణ్యాలున్న సిబ్బంది దొరకక ఇబ్బంది పడుతున్నాయి. వీరికి మార్కెట్లో క్రంచ్ ఉందని ఎస్‌బిఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బాలాజీ రాజగోపాలన్ వెల్లడించారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపింది. కొత్త సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోబోతున్నట్లు సీఈవో, ఎండీ శ్రీవాస్తవ స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించి ముందుగా అంతర్గతంగా కొన్ని అనుమతులు పొందాల్సి ఉందని.. త్వరలోనే ప్రకటనతో ముందుకొస్తామని పేర్కొన్నారు. బ్యాంక్ తన టెక్ అండ్ సైబర్ సెక్యూరిటీ స్థలాన్ని బ్రాంచ్ స్థాయిలో పర్యవేక్షిస్తుందని అన్నారు. ఇలాంటి తరుణంలో బ్యాంకులు తమ ప్రధాన సాంకేతికతపై వ్యయాన్ని పెంచాలని మరియు ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications