NRI News: అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు ఇమ్మిగ్రెంట్లను ప్రధానంగా భారతీయ కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. జన్మతః పౌరసత్వ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆర్డినెన్స్ పాస్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కడి కోర్టు స్టే ఇచ్చినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లో న్యాయపోరాటం కూడా కొనసాగుతోంది. కానీ భారతీయుల్లో మాత్రం భయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
ట్రంప్ ఆర్డినెన్స్ ఫిబ్రవరి 20, 2025 నుంచి అమలులోకి వస్తుందనే భయంతో భారతీయ రెసిడెంట్లు ఆందోళ చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ ప్రెగ్నెంట్ మహిళలు ముందుగానే సీసెక్షన్ ఆపరేషన్లు చేయించుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. అమెరికాలోని చాలా ఆసుపత్రుల్లో దీని వల్ల ప్రస్తుతం రద్దీ పెరిగిపోయిందని అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత యూఎస్‌లో H1B, L1 వీసాలపై నివసిస్తున్న మహిళలు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆతృతగా ఉన్నారు.

ఒకవేళ కొత్త చట్టం అమలులోకి వస్తే తాత్కాలిక వీసాలపై ఉద్యోగం లేదా ఇతర కారణాలతో అమెరికాలో ఉన్న జంటలకు పుట్టే పిల్లలకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం రాబోదని ట్రంప్ తేల్చి చెప్పేశారు. కొత్త చట్టం ప్రకారం ఇకపై తల్లిదండ్రుల్లో ఒక్కరైనా అమెరికన్ సిటిజన్ లేదా గ్రీన్ కార్డు హోల్డర్ అవటం తప్పనిసరి. లేనిపక్షంలో పుట్టిన పిల్లలు 21 ఏళ్లు నిండినప్పుడు అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. తాత్కాలిక వర్క్ వీసాలపై నివసిస్తున్న భారతీయ కుటుంబాలకు ప్రస్తుత మార్పులు ఆందోళనలను పెంచేస్తున్నాయి.
వైద్య నిపుణులు ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెక్సాస్‌లో ప్రసూతి వైద్యుడు డాక్టర్ SG ముక్కాల మాట్లాడుతూ ముందస్తుగా సీసెక్షన్ ఆపరేషన్ల ద్వారా పిల్లలకు జన్మనివ్వటం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాల గురించి హెచ్చరించారు. దీనివల్ల పిల్లలో ఫీడింగ్ సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో పాటు నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఇది చూస్తుంటే ఆరోగ్యకరమైన పిల్లల కంటే పుట్టిన వారు అమెరికన్లుగా ఉండాలని దంపతులు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
నెలలు నిండక ముందే పిల్లలకు జన్మనివ్వటం అనారోగ్యకరమైన శిశువులు పుట్టటానికి కారణం అవుతుందని వైద్య నిపుణులు దంపతులను హెచ్చరిస్తున్నారు. 1868లో ఆమోదించబడిన యూఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణ నుండి జన్మహక్కు పౌరసత్వం వచ్చింది. యూఎస్ గడ్డపై పుట్టిన ఎవరైనా స్వయంచాలకంగా పౌరసత్వం పొందుతారని పౌరసత్వ నిబంధన హామీ ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో దీనిని ముగించాలని ట్రంప్ తీసుకున్న చర్య రాజ్యాంగ చర్చలకు దారితీసింది. ఈ క్రమంలోనే విదేశీ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను కూడా మానేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications