Postal News: నగదు విత్‌డ్రా, మనీ ట్రాన్స్‌ఫర్ మరింత సులభం, ఇంటి వద్దకే ATM సర్వీసులు

India Post: గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రతి పనికీ భౌతికంగా హాజరు కావాల్సిన అసరం లేకుండా పోయింది. పెరుగుతున్న సాంకేతికత పుణ్యమా అని ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండా ఇట్టే పనులు జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ డెలివరీ దగ్గర నుంచి మనీ విత్‌డ్రా వరకు సర్వం అరచేతితోనే చేసేస్తున్నాం.

ప్రస్తుత డిజిటల్ యుగంలో నగదు డిమాండ్ తక్కువే అని చెప్పవచ్చు. అయితే కొన్ని చోట్ల కేవలం కరెన్సీని మాత్రమే అంగీకరించే సందర్భాలూ లేకపోలేదు. ఇలా నగదు అత్యవసరమైన వేళ బ్యాంకు లేదా ATMకి వెళ్లి విత్‌డ్రా చేసుకుంటాం. కానీ ఒకవేళ అందుకు సమయం లేనప్పుడు ఇంటి చెంతకే ATM వస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అటువంటి సేవను ఆఫర్ చేస్తోంది.

Indian postal offering ATM services at home

అయితే ఈ తరహా సర్వీస్ ఒకటి ఉందని ఇప్పటికీ చాలా మందికి తెలియక పోవడం విశేషం. ప్రజాసంక్షేమం కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవ పూర్తిగా ప్రజలకు చేరలేదు. ఆన్‌లైన్ ఆధార్ ATMను ఉపయోగించి చాలా తేలికగా ఇంటి వద్ద నుంచే డబ్బు తీసుకోవచ్చు. ఆధార్ నంబర్‌కు లింక్ చేయబడిన ఖాతా నుంచి బయోమెట్రిక్ డేటా వినియోగించి మనీ పేమెంట్స్, నగదు విత్‌డ్రా చేసే సదుపాయం ఉంది.

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఇందులో ఒక వ్యక్తి ఆధార్ నంబర్‌కు లింక్ చేయబడిన ఖాతా నుంచి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుతారు. ATM లేదా బ్యాంక్‌ని సందర్శించాల్సిన అవసరం లేకుండానే AePS ద్వారా చిన్న మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా ATMలు అందుబాటులో లేని ప్రజలకు నగదు అవసరాలు కూడా తీరతాయి.

'అత్యవసరంగా డబ్బు కావాలి కానీ బ్యాంకుకు వెళ్లే సమయం లేదా? చింతించకండి. మీ ఇంటి వద్ద నుంచే నగదును ఉపసంహరించుకోవచ్చు. IPB ఆన్‌లైన్ ఆధార్ ATM (AePS) ద్వారా ఈ సేవను ఉపయోగించుకోండి. పోస్ట్ ఆఫీస్ సిబ్బంది ఇప్పుడు మీ ఇంటి వద్దే డబ్బు పొందడానికి మీకు సహాయం చేస్తున్నారు' అని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ Xలో పోస్ట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+