ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. భారత ప్రధాని ఈ రోజు 75వ వడిలోకి అడుగపెట్టారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలో వాద్‌నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన Narendra Damodardas Modi.. ప్రధాని పదవిని అలంకరించక ముందు 2001 నుండి 2014 వరకు వరుసగా మూడు పర్యాయాలు గుజరాత్ సీఎంగా ఉన్నారు.సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన దేశ అత్యున్నత పదవిని చేపట్టి ఎన్నో రికార్డులు నెలకొల్పారు.
2014 మే 26న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ.. ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు. అప్పటి నుంచి Narendra Modi నాయకత్వంలో బీజేపీ 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక 2014, 2019, 2024లో మూడు వరుస లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఘన విజయం జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలతో సమానంగా మోదీని నిలిపింది.అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ ఆర్థిక పరిస్థితిని గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి.అయితే ఎంతో ప్రతిష్ఠాత్మక రాజకీయ నాయకుడైన మోదీకి ప్రత్యేకంగా వాణిజ్య ఆస్తులు లేదా భూములు లేకపోవడం అతిపెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు.

నరేంద్ర మోడీ గత ఎన్నికల సమయంలో తన ఆర్థిక అఫిడవిట్‌లో రూ. 3.02 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఆయనకు ఎలాంటి కారు, సొంత ఇల్లు, వ్యవసాయ లేదా వాణిజ్య భూములు లేవు. అయితే, ముఖ్యంగా బ్యాంకులో జమ చేసిన డబ్బు ఆయనకు పెద్ద ఆస్తిగా ఉంది. SBIలో రూ. 2.86 కోట్లకు పైగా డిపాజిట్ చేశారు. దీనివల్ల వడ్డీ రూపంలో ప్రతిచెల్లింపు ఆదాయం వస్తుంది. అదేవిధంగా, NSSలో రూ. 9 లక్షలకు పైగా డిపాజిట్ ఉంది. బాండ్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు లేదా LIC లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఏవీ మోదీ దగ్గర లేవు.
ఆదాయ వనరులను పరిశీలిస్తే.. ప్రధానమంత్రిగా మోదీ నెలకు రూ. 1.66 లక్షల జీతం పొందుతారు. అదనంగా, ఆయనకు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.అవేంటంటే.. పార్లమెంటరీ అలవెన్స్ రూ. 45 వేలు, ఖర్చు భత్యం 3 వేలు, రోజువారీ భత్యం 2 వేలు కలిపి ఉంటాయి. ఈ మొత్తం ఆయన నెలవారీ ఆదాయాన్ని చూపిస్తుంది. ఆయనకు ఇప్పటివరకు ఎలాంటి అప్పులు లేవు. ఇతరులకు రుణాలిచ్చే వ్యవహారం కూడా మోదీ వద్ద లేదు.
ప్రధాని మోదీ ఆర్థిక సంవత్సర ఆదాయం
2022-2023 - రూ. 23,56,080
2021-2022 - రూ. 15,41,870
2020-2021 - రూ. 17,07,930
2019-2020 - రూ. 17,20,760
2018-2019 - రూ. 11,14,230
బంగారు ఉంగరాలు విషయానికి వస్తే.. నరేంద్ర మోదీ దగ్గర నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ రూ. 2,67,750 గా అంచనా వేయబడింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా రాజకీయ నాయకులు లేదా వ్యాపారవేత్తలు పెద్ద స్థిరాస్తి, భూములు, విలాసవంతమైన కారు, ఆఫీసు కలిగి ఉంటారు. అయితే నరేంద్ర మోదీ మాత్రం చాలా సాధారణ జీవనం గడుపుతున్నారు. అతని ఆస్తుల మొత్తంలో ఎక్కువ భాగం కేవలం బ్యాంక్ డిపాజిట్లేనని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications