భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. రూ. 400 కోట్ల నష్టం, ఒకరి మృతి..

Indian Pharma Company Hit: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న భారతీయ పారిశ్రామికవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని 'కుసుమ్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్' (కుసుమ్ గ్రూప్) ఫార్మా ప్లాంట్‌పై రష్యా.. షాహెద్/ఎఫ్పీవీ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దారుణ దాడిలో ఫ్యాక్టరీకి చెందిన 52 ఏళ్ల ఇంజనీర్ అక్కడికక్కడే మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో ప్లాంట్ ప్రధాన భవన సముదాయం పూర్తిగా ధ్వంసమైందని, నష్టం విలువ సుమారు 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 400 కోట్లు) దాటినట్లు కంపెనీ అంచనా వేసింది.

ఈ ఘటనపై కుసుమ్ గ్రూప్ అధినేత రాజీవ్ గుప్తా స్పందిస్తూ.. ఆరు డ్రోన్లతో నేరుగా తమ ప్లాంట్‌లోని ఇంజనీరింగ్ విభాగంపైనే దాడి చేశారని, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, కావాలనే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి అని స్పష్టం చేశారు. గడిచిన నెల రోజులుగా ఉక్రెయిన్‌లోని ఫార్మా, ఆహార పదార్థాల ఉత్పత్తి స్థావరాలపై రష్యా దాడులను తీవ్రం చేసిందని ఆయన తెలిపారు. ఈ ప్లాంట్ తిరిగి యథావిధిగా పనిచేయడానికి కనీసం 1 నుండి 2 సంవత్సరాల సమయం పడుతుందని.. ప్రస్తుతానికి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నామని వెల్లడించారు.

Russian Drone Strike Ukraine Indian Pharma Company Indian-Owned Pharma Plant Russia Ukraine War Drone Attack Pharma Plant Destroyed Indian Company One Dead 50 Million Damage Ukraine News Russian Attack Indian Pharma Industry Pharmaceutical Plant International News 50

దాడికి గురైన ప్రదేశం ఎలాంటి సైనిక స్థావరం కాదని, ఉక్రెయిన్‌తో పాటు అనేక సీఐఎస్ (CIS) దేశాలకు ప్రాణరక్షణ, అత్యవసర మందులను సరఫరా చేసే సాధారణ ఔషధ తయారీ కేంద్రమని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. రష్యా డ్రోన్లు కుసుమ్ గ్రూప్‌‌ను లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండోసారి.

గతంలో ఏప్రిల్ 14, 2025న కూడా కంపెనీకి చెందిన ప్రధాన గిడ్డంగి డ్రోన్ దాడిలో పూర్తిగా దగ్ధమైంది. మానవతా దృక్పథంతో నిరంతరం రోగులకు మందులు అందించే తమ పరిశ్రమలను యుద్ధ సంఘర్షణల్లోకి లాగడంపై కంపెనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Also Read

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సంతాపం తెలిపారు. రష్యా నిరంతరం వందలాది డ్రోన్లతో సాధారణ పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తోందని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఉక్రెయిన్, రష్యాల మధ్య నడుస్తున్న యుద్ధాన్ని ముగించడానికి భారతదేశం నిరంతరం ప్రయత్నిస్తోందని.. రెండు దేశాల అగ్రనేతలతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉన్నత స్థాయి చర్చలు జరుపుతున్నారని భారత ప్రభుత్వం తెలిపింది.

1994లో వ్యాపారం ప్రారంభించి, 1997లో ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన కుసుమ్ గ్రూప్, ఉక్రెయిన్‌లో దెబ్బతిన్నప్పటికీ భారత్‌లోని తన కేంద్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మందుల సరఫరాను కొనసాగిస్తుంది. కంపెనీకి రాజస్థాన్‌లోని భివాడిలో రెండు ఉత్పాదక కేంద్రాలు, మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని పిథంపూర్ SEZలో ఒక ఆధునిక యూనిట్ ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ఉన్నప్పటికీ తమ భారతీయ యూనిట్ల ద్వారా వ్యాపారాన్ని, సరఫరా గొలుసును నిలబెట్టుకుంటామని కంపెనీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+