Digital transactions: డిజిటల్ పేమెంట్స్ విభాగంలో కనీవినీ ఎరుగని రీతిలో భారత్ దూసుకుపోతోంది. అగ్రరాజ్యాలు సైతం అందుకోలేని ఘనత ఇండియా సొంతం చేసుకుంది. అయితే దేశీయ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎం సంక్షోభం నేపథ్యంలో పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక సిఫార్సులు చేసింది.
ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో వాల్ మార్ట్ యాజమాన్యంలోని ఫోన్ పే మరియు గూగుల్ పే లు 83 శాతం కంటే ఎక్కువ మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి. దీనిలో 46.91 శాతంతో ఫోన్ పే అగ్రస్థానంలో ఉండగా.. 36.39 శాతంతో గూగుల్ కొనసాగుతున్నట్లు IT మరియు కమ్యూనికేషన్స్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

అయితే ఈ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా దేశీయ ఫిన్‌టెక్ ప్లేయర్‌ల వృద్ధికి మద్దతు ఇవ్వాలని భారత పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వాన్ని కోరింది. మరో ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం తన పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం విషయంలో ఆంక్షలకు గురవుతున్న తరుణంలో.. 58 పేజీల నివేదికతో కూడిన సవివర సిఫార్సులను చేసింది.
పరిమాణం ప్రకారం దేశీయంగా అభివృద్ధి చేసిన BHIM UPI మార్కెట్ వాటా కేవలం 0.22 శాతమేనని నివేదిక స్పష్టం చేసింది. కేవలం రెండు కంపెనీల ఏకచత్రాధిపత్యంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఒక నెలలో ఏ ప్లేయర్ అయినా 30 శాతానికి మించి UPI లావాదేవీలు ప్రాసెస్ చేయకుండా కట్టడి చేయాలని ప్రతిపాదించింది. తాజాగా ప్యానెల్ కూజా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications