Dream Flight: గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ ఇళ్లకే పరిమితం చేసిన నేపథ్యంలో దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో లాక్‌డౌన్ పరిస్థితి ఎదురైంది. ఈ లాక్‌డౌన్ కాలంలో చాలా మంది తమ కలలను సాకారం చేసుకునేందుకు సమయాన్ని వెచ్చించారు. ఆ విధంగా.. లండన్‌కు చెందిన భారతీయ సంతతికి చెందిన ఒక కుటుంబం లాక్‌డౌన్ సమయంలో వారి స్వంత విమానాన్ని తయారు చేసింది. ఇదెలా సాధ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ కుటుంబం..
కరోనా వైరస్ విజృంభించిన సమయంలో.. దాదాపు ప్రపంచమంతా లాక్‌డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ లాక్‌డౌన్ సమయంలో అందుబాటులో ఉన్న ఖాళీ సమయం కారణంగా.. ప్రజలు వివిధ రకాల ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. అలా ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఒక కుటుంబం లాక్‌డౌన్ సమయంలో తమ సొంత విమానాన్ని తయారు చేసుకుంది. ప్రస్తుతం వారు అందులోనే ప్రయాణిస్తున్నారు.

ప్రైవేట్ విమానం..
భారత సంతతికి చెందిన అశోక్, అతని భార్య అభిలాషకు తారా, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సొంతంగా విమానం కొనుక్కోవాలని వారు చాలా ఏళ్లుగా కలలు కంటున్నారు. ఈ కలను నిజం చేసుకోవడానికి కుటుంబం లాక్‌డౌన్ సమయంలో వచ్చిన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకున్నారు.

పైలట్ శిక్షణ పొంది..
శిక్షణ పొందిన పైలట్‌గా, లాక్‌డౌన్ సమయంలో దొరికిన ఖాళీ సమయంలో అశోక్ తన కుటుంబం కోసం విమానాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. విమానాల తయారీకి అవసరమైన సామాగ్రి మెుత్తాన్ని సమకూర్చుకున్నాడు. కష్టపడి అతను తన కుటుంబ సహాయంతో రెండేళ్లలో మొత్తం విమానాన నిర్మాణాన్ని పూర్తి చేశాడు

ఎంత ఖర్చవుతుంది?
మెుదట్లో రెండు సీట్ల చిన్న విమానాన్ని అద్దెకు తీసుకుని తిరిగిన ఈ కుటుంబం పిల్లలు పుట్టాక 4 సీట్ల విమానం అవసరం కావటంతో దీనిని తయారు చేసుకున్నారు. ఈ విమానాన్ని తయారు చేసేందుకు భారత కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 1.8 కోట్ల ఖర్చయినట్లు అశోక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం అశోక్ తన కుటుంబంతో కలిసి ఈ విమానంలో యూరప్‌ను చుట్టిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కల కోసం డబ్బు ఆదాచేస్తూ..
లాక్‌డౌన్ సమయంలో లభించిన ఖాళీ సమయంలో విమానాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు తాము మొదటి లాక్‌డౌన్ సమయంలో డబ్బు ఆదా చేయడం ప్రారంభించామని ఆశోక్ తెలిపారు. ఆ తర్వాత రెండోసారి కర్ఫ్యూ సమయంలో విమానం తయారు చేసేందుకు కృషి చేసినట్లు వెల్లడించాడు. ఇప్పుడు తన సొంత విమానం కల సాకారమైందని, ఈ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్‌ను చుట్టేయటంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఏదేమైనా విమానం తయారు చేయటం అంటే అంత ఈజీ కాదని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. వారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications