ఒక్కోసారి ఎవరి అదృష్టం ఎలా వరిస్తుందో అస్సలు ఊహించలేం. అలాగే అదృష్టం మనకేం తగులుతుందిలే అని అనుకునేలోపే మనం నమ్మలేని విధంగా వరిస్తుంది. చాల దేశాలలో ఇంకా ఇండియాలో కూడా లక్కి డ్రా పేరిట చాల స్కింలు కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ మనకు లక్కీ డ్రాలో ఫ్రిడ్జ్, టివి, గోల్డ్ లేదా బైక్ లభిస్తుంది. కానీ ఒకేసారి కోటీశ్వరులు అయ్యే డ్రా తగిలితే... ఆ అనందం అంత ఇంత కాదు.
లక్కి లాటరీ గెలవడం అనేది చాలా మందికి ఒక కల కావచ్చు. చాల మంది అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లక్కీ డ్రా కూపన్స్ రాయడం లేదా లక్కీ డ్రాలో పాల్గొంటుంటారు.అయితే మీకు లక్కీ డ్రా కొట్టడం ఆనందంగా అనిపించిన, మీరు ఇతర దేశంలో అది కూడా పెద్ద మొత్తంలో డబ్బు తగిలి కోటీశ్వరుడిగా మారితే మీకు ఖచ్చితంగా యమా థ్రిల్ ఉంటుంది.

సింగపూర్‌లో 1 మిలియన్ డాలర్ల లాటరీ!
కొద్దిరోజుల క్రితం సింగపూర్‌లో లాటరీలో 1 మిలియన్ డాలర్లు గెలుచుకొని, భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అదృష్టవంతుడయ్యాడు. అతని పేరు బాలసుబ్రమణ్యం చితంబరం. ఇంజనీర్‌గా పని చేస్తూన్న అతనికి ఒక లాటరీలో ఊహించని గిఫ్ట్ పొందారు.
సింగపూర్‌లోని ముస్తఫా జ్యువెలరీ నిర్వహించిన గ్రాండ్ లక్కీ డ్రాలో ఈ ఇంజనీర్ పాల్గొని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దింతో అతను భారీ మొత్తంలో $10,00,000 యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ అందుకున్నాడు, ఈ మొత్తం ఇండియాలో 8.46 కోట్ల రూపాయలకు సమానం. అవును, మీరు చదివింది నిజమే. బాలసుబ్రమణియన్ అక్షరాలా రూ.8 కోట్ల కంటే ఎక్కువ మొత్తం అదృష్టంగా గెలుచుకున్నారు.
సింగపూర్ నివాసి బాలసుబ్రమణ్యం చితంబరం సింగపూర్‌లోని ముస్తఫా జ్యూయలరీలో తన భార్య కోసం S$70,000 (సుమారు రూ. 3.7 లక్షలు) విలువైన బంగారు ఆభరణాలను కొన్నాడు. తరువాత జ్యువెలరీ షోరూమ్ నిర్వహించిన లక్కీ డ్రాలో చితంబరం US$1 మిలియన్ (సుమారు రూ. 8.45 కోట్లు) గెలుచుకున్నారు.
బాలసుబ్రమణియన్ సింగపూర్‌లో నివసిస్తున్నారని, అతను రెండేళ్లకు పైగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా సింగపూర్లో పనిచేస్తున్నారని జ్యువెలరీ షాప్ వారు గుర్తించారు. లాటరీలో మొత్తం 1 మిలియన్ డాలర్లు గెలవడం గురించి తెలుసుకున్న బాలసుబ్రమణియన్ మొదట ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
లాటరీ విజేత
తన తండ్రి వర్ధంతి రోజు చాలా ప్రత్యేకమైన రోజున ఈ లాటరీ విజేతగా నేను గెలవడం విషయం తనకు తెలియజేసినట్లు పేర్కొన్నాడు. "నేను మా నాన్నగారి వర్ధంతి రోజున గుడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాను, ఉదయం నాకు కాల్ వచ్చింది, తరువాత ఈ విషయం చెప్పారని
ఇదంతా మా నాన్నగారి ఆశీర్వాదం అని నేను భావిస్తున్నాను, అంతేకాదు చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు" అని అన్నాడు.
విజేతను ప్రకటిస్తూ, ముస్తఫా జ్యువెలరీ సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ "ప్రతినెలా లక్కీ డ్రాలను నిర్వహించిన 14 నెలల తర్వాత, మనం అందరం ఎదురుచూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చింది. మా గ్రాండ్ లక్కీ డ్రా విజేతను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.
చితంబరం తాను గెలుచుకున్న మొత్తంలో కొంత విరాళంగా ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. "ఈ వార్త విన్నప్పుడు నేను నమ్మలేకపోయాను" అని కన్నీళ్లతో వీడియో కాల్ సందర్భంగా చితంబరం చెప్పారు. తన తల్లితో ఈ సంతోషకరమైన వార్తను చెప్తానని అలాగే సింగపూర్‌లోని చారిటీకి కూడా కొంత విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చితంబరం చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications