Amrita Ahuja: ఒకపక్క ప్రపంచమంతటా ఆవరించిన ఆర్థిక మందగమనం, మాంద్యాలతో వ్యాపారాలను ఎలా కాపాడుకోవాలా అని బిలియనీర్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే సమయంలో అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ సంచలనాలను బయటకు తీసుకురావటంతో వ్యాపారుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన బ్లాక్ ఇంక్ కంపెనీ వ్యవహారంలో భారత సంతతికి చెందిన పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీకి సీఎఫ్ఓగా వ్యవహరిస్తున్న అమృతా అహుజా పాత్రపై కూడా తన నివేదికలో ప్రస్థావించటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మిలియన్ల కొద్ది డాలర్లను డంప్ చేయటంలో ఆమె కీలక పాత్ర పోషించిందని రీసెర్చ్ సంస్థ ఆరోపించింది.

కరోనా సమయంలో స్టాక్ మార్కెట్లు మెుదట్లో భారీగా క్షీణించినప్పటికీ ఆ తర్వాత మెల్లగా తేరుకున్నాయి. ఆ సమయంలో కంపెనీ వ్యవస్థాపకులు జాక్ డోర్సే, జేమ్స్ మెక్‌కెల్వీలతో కలిసి.. అమృత మిలియన్ల కొద్ది డాలర్లను స్టాక్‌లో డంప్ చేయడంలో పాల్గొన్నారని రిపోర్ట్ బహిర్గతం చేసింది. దీని ద్వారా వారు దాదాపు 1 బిలియన్ డాలర్ల వరకు ప్రయోజనాన్ని పొందారని వెల్లడైంది.
బ్లాక్ కంపెనీలో కీలక అధికారిగా ఉన్న అమృత క్లీవ్‌ల్యాండ్ శివారులో డే-కేర్ సెంటర్ నడుపుతున్న భారతీయ వలసదారుల కుటుంబానికి చెందిన కుమార్తె. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డ్యూక్ యూనివర్శిటీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వంటి అత్యున్నత విశ్వవిద్యాలయాల నుంచి తన విద్యను పూర్తి చేశారు. ఆమె 2001లో ప్రఖ్యాత కన్సల్టింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీతో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది.

2022లో ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతమైన మహిళా సమ్మిట్‌లో కూడా అమృత కనిపించారు. అయితే 2019లో బ్లాక్ కంపెనీలో చేరడానికి ముందు ఆమె ఎయిర్‌బిఎన్‌బి, మెకిన్సే & కంపెనీ, ది వాల్ట్ డిస్నీ వంటి ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేశారు. ఫాక్స్‌లో పనిచేస్తున్నప్పుడు స్ట్రీమింగ్ సర్వీస్ ప్లాట్‌ఫారమ్ అయిన హులును ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.


Click it and Unblock the Notifications