LPG Rates: ప్రతినెల మెుదటి తారీఖున దేశంలోని చమురు కంపెనీలు తమ గ్యాస్ విక్రయ ధరలను సవరిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్ల రేట్లను మారుస్తుంటాయి. ఈ క్రమంలో ఎన్నికల వేళ వినియోగదారులకు స్వల్ప ఊరటను అందించే విధంగా తగ్గింపు ప్రకటన నేడు వచ్చింది.
మే 1న దేశంలోని చమురు కంపెనీల ప్రకటన ప్రకారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర రూ.19 మేర తగ్గించబడింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో తగ్గిన రిటైల్ విక్రయ ధర రూ.1,745.50గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో దేశంలోని ఇతర మెుట్రో నగరాల్లో ధరలు గమనిస్తే.. ముంబైలో రూ.1,698.50, చెన్నైలో రూ.1,911, కలకత్తాలో రూ.1,859గా కొనసాగుతున్నాయి.

అమెరికాలో ముడి చమురు నిల్వలు పెరగడంతో పాటు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో సంభావ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి పెరుగుతున్న ఆశావాదం కారణంగా వరుసగా మూడవ రోజు పడిపోయిన ప్రపంచ చమురు ధరల తాజా తగ్గుదలకు దోహదపడింది. గతనెలలో సైతం దేశంలోని చమురు కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 19 కేజీల గ్యాస్ సిలిండర్లతో పాటు 5 కేజీల ఫ్రీట్రేడ్ సిలిండర్ల ధరలను తగ్గించాయి.
వాస్తవానికి దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యాపారులు వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండ్రల రేట్లు తగ్గటం కొంత సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. దీనికి ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలు రెండు విడతల్లో గృహవినియోగ డొమెస్టిక్ సిలిండర్ల ధరలను తగ్గించింది. వాస్తవానికి ఇది చాలా కాలంగా సామాన్య ప్రజలు ఎదురుచూసిన తగ్గింపు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో గ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గింపు, ఏడాదికి కొన్ని సిలిండర్ల ఉచిత డెలివరీ వంచి ప్రకటనలు సైతం చేశాయి.


Click it and Unblock the Notifications