సొంతిటి కలను వదులుకున్న సగం మంది భారతీయులు, షాకింగ్ కారణాలు చెబుతున్న సీఏ
భారతదేశంలో ఇల్లు కొనడం ఇప్పుడు లక్షలాది మధ్యతరగతి భారతీయులకు కలగానే మిగిలిపోతోంది. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం ఇకపై భద్రతకు మార్గం కాదని..అది అసమానతలకు నిలయంగా మారుతోందని చార్టర్డ్ అకౌంటెంట్ పెట్టిన పోస్ట్ చెబుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ పెట్టిన పోస్ట్ ప్రకారం.. దేశంలో 59 శాతం మంది భారతీయులు ఇల్లు కొనాలనే ఆశను వదులుకున్నారు.దీనికి ప్రధాన కారణం ధరలు పెరగడం ఒక్కటే కాదు. జీతం ఆధారంగా జీవించే వారిని పక్కనబెట్టి, ఊహాగానాలతో డబ్బు సంపాదించే వారిని ప్రోత్సహిస్తున్న వ్యవస్థ కూడా ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
గత ఐదు సంవత్సరాలలో ప్రధాన నగరాల్లో ఆస్తి ధరలు ఎలా రెట్టింపు అయ్యాయో, సగటు ఆదాయం స్వల్పంగా పెరిగిందని ఈ పోస్ట్ మనకు హైలైట్ చేస్తుంది. ఈ పోస్ట్ మధ్యతరగతి వారు ఇల్లు కొనడం దాదాపు అసాధ్యమేనని చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'యాక్స్'లో కౌశిక్ చేసిన పోస్ట్ ప్రకారం.. 59 శాతం మంది భారతీయులు ఇల్లు కొనాలనే ఆశను వదులుకున్నారు. ఇది వారి ఎంపిక వల్ల కాదు, పెరుగుతున్న ధరల వల్ల జరిగింది.ద్రవ్యోల్బణం ఒక ప్రధాన సమస్య అయినప్పటికీ..జీతం ఆధారిత జీవనశైలిని వెనుకబెట్టే వ్యవస్థను ఆయన ప్రధానంగా విమర్శించారు. ఇది ఊహాజనిత (speculative) ఆదాయాలను ప్రోత్సహిస్తూ, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని పెంచుతోందన్నారు.

గత ఐదు సంవత్సరాలలో భారత్ లోని టాప్ 8 నగరాల్లో ఆస్తి ధరలు రెట్టింపు అయ్యాయి. 2018లో ధరలు చదరపు అడుగుకు రూ. 5,500 ఉండగా..2023లో అది రూ. 11,000కి పెరిగింది. ఇక ఉద్యోగి సగటు జీతం స్వల్పంగా పెరిగింది. 2019లో జీతం సంవత్సరానికి రూ. 1.35 లక్షలు, 2024లో రూ. 1.80 లక్షలకు పెరిగింది, అంటే కేవలం 33 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. నితిన్ కౌశిక్ ఏమంటున్నారంటే.. భారతదేశంలో అసమానత పెరుగుతోంది. గృహ రుణాలకు 5-20-40 నియమం ఇకపై పనిచేయదని చెబుతున్నారు. ఈ నియమం ప్రకారం మీ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు అయినప్పటికీ కూడా మీరు రూ. 2 కోట్ల విలువైన ఇల్లు కొనలేరు. దీని కోసం మీరు మీ మొత్తం జీతాన్ని 20 సంవత్సరాలు ఆదా చేసుకోవాలని తెలిపారు.
రియల్ ఎస్టేట్ రంగం మొత్తం నల్లధనం ఆధారిత వ్యవస్థతో నడుస్తోందని హైలెట్ చేశారు. సాధారణంగా రూ. 1 కోటి విలువైన ఆస్తికి రూ. 32.5 లక్షల పన్ను విధించాలి.దీనికి ఉదాహరణగా ఆయన ఏం చెబుతున్నారంటే.. రూ. 1 కోటి విలువైన ఆస్తికి సుమారు రూ. 32.5 లక్షల పన్ను విధించాలి. కానీ, ప్రజలు ఆస్తిని తక్కువ ధరకు రిజిస్టర్ చేసి, మిగతా మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. దీని వల్ల ప్రభుత్వానికి కేవలం 10 శాతం పన్ను మాత్రమే వస్తోంది. మిగతా భాగం నల్లధనంగా మారుతుందని చెబుతున్నారు. ఈ వ్యవస్థ బాగా సంపాదించడానికి కాదు, బాగా మోసం చేయడానికి నేర్పుతుందన్నారు.
ఈ రోజుల్లో ప్రజలు ఇళ్లను నివసించడానికి స్థలంగా కాకుండా డబ్బును దాచుకునే స్థలంగా భావిస్తారు. అయితే ధనవంతులు ప్రీ-లాంచ్ ప్రాజెక్టుల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ ఆదాయం పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని వాడుకుని భూమి ఒప్పందాలు చేస్తారు.ఫలితంగా వారు పన్ను తప్పించుకుంటూ నిరంతరం పెట్టుబడులు పెడుతుంటారు.ఈ వ్యవస్థలో మధ్యతరగతి ప్రజలు నిజమైన ఇల్లు కొనాలనే ఆశను కోల్పోతున్నారు.
గుర్గావ్ వంటి నగరాల్లో ఇళ్ల ధరలు చాలా పెద్ద మొత్తంలో పెరిగాయి, అది న్యూయార్క్ కంటే ఖరీదైనదిగా మారింది. ఈ వ్యవస్థ మీ కోసం ఎప్పుడూ తయారు చేయబడలేదు. ఒకప్పుడు మధ్యతరగతి వారికి ముఖ్య లక్షణంగా ఉన్న ఇంటి కల ఇప్పుడు వారికి అందుబాటులో లేకుండా పోతోంది. ప్రజలు కష్టపడి పనిచేయకపోవడం వల్ల కాదు..ధనవంతుల ఆట అన్యాయంగా జరుగుతోంది కాబట్టి" అని పోస్ట్ హైలెట్ చేస్తోంది. ఇది జోక్ కాదని, వాస్తవమని ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications