Stock Markets: ఊగిసలాటలో దేశీయ మార్కెట్లు.. ఆరంభం నుంచి ఫ్లాట్ ట్రేడింగ్..
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఫ్లాట్ ఓపెనింగ్ తో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్న తరుణంలో దేశీయ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.
చాలా కంపెనీలు ఈవారం తమ క్యూ-4 ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం మంచి ఫలితాలను, ఆదాయ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఫలితాల కోసం వేచిచూసే ధోరణిని కొనసాగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం మార్కెట్ల ప్రారంభం తర్వాత కొద్దిసేపు సూచీలు లాభాలు నష్టాల మధ్య ఊగిసలాడుతూ వచ్చాయి. అయితే 9.28 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 66 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 93 పాయింట్ల, నిఫ్టీ మిడ్ క్యాప్ 68 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
NSE సూచీలో బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, రిలయన్స్, బ్రిటానియా, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్జూమర్, ఎస్బీఐ, ఎల్ టి, ఎన్టీపీసీ, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.
ఇదే సమయంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సిప్లా, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, గ్రాసిమ్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, విప్రో, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.


Click it and Unblock the Notifications