Stock Market: స్వల్ప లాభాల్లో సూచీలు.. ఇన్వెస్టర్ల చూపు RBI వైపు..
Stock Market: నిన్న భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. రిజర్వు బ్యాంక్ సమావేశం చివరి రోజు కావటంతో వడ్డీ రేట్ల ప్రకటన కోసం మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 54 పా యింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 18 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే ఒడిదొడుకుల్లో ఉన్న నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం స్థబ్ధుగా 2 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 58 పాయింట్ల పాజిటివ్ లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

ప్రధానంగా రిజర్వు బ్యాంక్ ఎంపీసీ సమావేశం చివరి రోజు కావటంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేయటానికి ముందు రిజర్వు బ్యాంక్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అందరూ ఊహించినట్లుగా రేట్ల పెంపుకు బ్రేక్ కొనసాగుతుందా లేక ఇతర ప్రకటనలు ఉంటాయా అనే ఆతృత అందరిలోనూ కనిపిస్తోంది. నిర్ణయం మార్కెట్లకు సానుకూలంగా ఉంటే బ్యాంకింగ్ స్టాక్స్ తిరిగి పుంజుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ, హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, నెస్లే, టాటా స్టీల్, ఎల్ టి, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టైటాన్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో కోటక్ బ్యాంక్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్, సన్ ఫార్మా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications