Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే అమెరిగా మార్కెట్లు నిన్న నష్టపోవటంతో పాటు ఇతర అంతర్జాతీయ కారణాలు మార్కెట్లకు ప్రతికూల సంకేతాలను అందించాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గటం, ద్రవ్యోల్బణం కట్టడి చర్యలు కొనసాగటం కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఒత్త ఏడాది ప్రారంభమై రెండు వారాలు కూడా గడవక ముందే టెక్ కంపెనీలు ఉద్యోగాల కోతలో దూకుడు పెంచటం ఇన్వెస్టర్లను కలవరానికి గురిచేస్తోంది.

మార్కెట్ సూచీలు..
ఉదయం 10 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 202 పాయింట్లు, నిఫ్టీ సూచీ 65 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 53 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 70 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల పవనాలు దీనికి కారణంగా నిలుస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

నిర్మలమ్మ బడ్జెట్..
చాలా కాలంగా మార్కెట్లు బడ్జెట్ ప్రకటలనకు తక్కువగా ప్రతిస్పందిస్తున్నాయి. కేవలం కొన్ని షార్ట్ టర్మ్ నిర్ణయాల విషయంలో మాత్రంమే స్టాక్స్ రియాక్ట్ అవుతున్నాయి. మార్కెట్లు రొటీన్ బడ్జెట్ ప్రకటనలకు అలవాటు పడ్డాయని నిపుణులు అంటున్నారు. ఈ సారి బడ్జెట్లోనూ భారీ ప్రకటనలు పెద్దగా ఉండకపోవచ్చని.. కొన్ని రంగాలకు ప్రకటించే తాయిలాలు కొంత ప్రభావాన్ని చూపవచ్చని వారు భావిస్తున్నారు.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, గ్రాసిమ్, బజాజ్ ఆటో, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే క్రమంలో సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజస్, టైటాన్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, నెస్లే, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, దివీస్ ల్యాబ్స్, టాటా కన్జూమర్, విప్రో, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బ్రిటానియా కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications