Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ మెుదలుపెట్టాయి. ప్రధానంగా నిన్న నష్టాలతో ముగించినప్పటికీ.. అదే తీరు నేటి ప్రారంభంలోనూ కనిపిస్తోంది.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 90 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 17 పాయింట్ల మేర కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 78 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 36 పాయింట్ల నష్టాలతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటం కూడా ఇండియా మార్కెట్లను ప్రభావితం చేస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మెుదటి సెషన్లో నేడు మార్కెట్లు నష్టాల బాట పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం దీనికి కారణంగా వారు చెబుతున్నారు. మూడీస్ అనేక చిన్న మరియు మధ్యతరహా US సంస్థలపై రుణ రేటింగ్‌లను డౌన్‌గ్రేడ్ చేసిన తర్వాత పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించటం కూడా మార్కెట్లను దిశానిర్థేశం చేస్తోంది. అమెరికా ప్రధాన బ్యాంకుల క్రెడిట్ రేటింగ్ తగ్గించవచ్చని తెలుస్తోంది.
ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, టాటా కన్సెల్టెన్సీ, టైటాన్, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, నెస్లే, జేఎస్డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, ఎయిర్ టెల్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్స్, మారుతీ, ఐషర్ మోటార్స్, రిలయన్స్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, ఐటీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, అపోలో హాస్పిటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కొ, టాటా స్టీల్, ఎస్బీఐ, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications